Homeఎంటర్టైన్మెంట్Hyper Aadi Angry: ప్రేక్షకుడిపై ఆవేశం తో ఊగిపోయిన హైపర్ ఆది.. సంచలనం రేపుతున్న వీడియో..

Hyper Aadi Angry: ప్రేక్షకుడిపై ఆవేశం తో ఊగిపోయిన హైపర్ ఆది.. సంచలనం రేపుతున్న వీడియో..

Hyper Aadi Angry On Fan Video: ఈటీవీ జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయ్యి , టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ సక్సెస్ ఫుల్ మరియు డిమాండ్ ఉన్న కమెడియన్స్ గా మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు . అలాంటి వారిలో హైపర్ ఆది ఒకరు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదులుకొని మరీ ఈ ఇండస్ట్రీ లోకి వచ్చిన ఆయన , తన కామెడీ టైమింగ్ తో, అద్భుతమైన టాలెంట్ తో ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మార్కుని ఏర్పాటు చేసుకున్నాడు. సినిమాల పరంగా ఎంత బిజీ గా ఉన్నప్పటికీ, బుల్లితెర పై ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాడు హైపర్ ఆది. ఈటీవీ లో ప్రస్తుతం విజయవంతంగా నడుస్తున్న ‘ఢీ 20’ డ్యాన్స్ షోలో ఒక టీమ్ లీడ్ గా వ్యవహరిస్తున్న హైపర్ ఆది , ప్రతీ ఆదివారం ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షో లో కూడా కనిపిస్తున్నాడు.

ఇవి మాత్రమే కాకుండా, అప్పుడప్పుడు పండగలకు చేసే ఈవెంట్స్ లో కూడా కనిపిస్తూ ఉంటాడు హైపర్ ఆది. అయితే రీసెంట్ గానే ఈటీవీ ఛానల్ 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాల వారీగా ప్రత్యేక ఈవెంట్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. అలా ఒక జిల్లాలో ఈవెంట్ నిర్వహించినప్పుడు హైపర్ ఆది కూడా ఆ ఈవెంట్ కి విచ్చేశాడు. అయితే హైపర్ ఆది అంటే ఇష్టం లేని వారిలో ఒకరు అక్కడికి వచ్చి , హైపర్ ఆది ని దుర్భాషలాడుతూ ఉన్నాడట. ఇది గమనించిన హైపర్ ఆది స్టేజి మీద నుండి క్రిందకు వేలు చూపిస్తూ, అతని పై అరుస్తూ క్రిందకు దిగి వచ్చాడు. ఆ వ్యక్తితో ఆయన గొడవ పడుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అయితే హైపర్ ఆది ఒక సాధారణ కమెడియన్ , అతనిపై ఎందుకు ద్వేషం ఉంటుంది అని మీరు అనుకోవచ్చు.

కానీ ఆయన రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ని ఎవరు ఏ చిన్న మాట అన్నా తీవ్ర స్థాయిలో వారిపై విరుచుకుపడుతూ ఉంటాడు. ఈమధ్య కాలంలో కాస్త తగ్గాడు కానీ , హైపర్ ఆది అంటే ఒక సెక్షన్ వర్గానికి పడదు. అంతే కాకుండా ఆయన ఆడవాళ్ళ పై వేసే ఫన్నీ పంచులు కూడా చాలా మందికి నచ్చాడు. ఈ రెండు గ్రూప్స్ లో ఎవరు ఒకరు మొన్న హైపర్ ఆది ని ట్రిగ్గర్ చేసి ఉండొచ్చని , అందుకే ఆయన అంత ఫైర్ అయ్యాడని అంటున్నారు. ఈ రేంజ్ లో హైపర్ ఆదిని కోపం గా ఎప్పుడూ చూడలేదని , ఆయనలో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చర్యపోయామంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular