Homeఎంటర్టైన్మెంట్Adivi Sesh: అడివి శేష్ కారణంగా అనుష్క కి తీవ్ర గాయాలు.. వెక్కి వెక్కి ఏడ్చిన...

Adivi Sesh: అడివి శేష్ కారణంగా అనుష్క కి తీవ్ర గాయాలు.. వెక్కి వెక్కి ఏడ్చిన స్టార్ హీరోయిన్..

Adivi Sesh: విభిన్నమైన కథలతో యూత్ ఆడియన్స్ లో ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకున్న హీరోలలో ఒకరు అడివి శేష్(Adivi Sesh). అలాంటి హీరో గత నాలుగేళ్ల నుండి ఒక్క సినిమా కూడా విడుదల చేయకపోవడం గమనార్హం. హడావిడిగా సినిమాలు చేసి , ఫ్లాపులు అందుకోవడం కంటే , నిదానంగా సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ ని అందుకోవడం పైనే ఈయన ద్రుష్టి సారించాడు కాబట్టి, ఇన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఆయన హీరో గా […]

Adivi Sesh: విభిన్నమైన కథలతో యూత్ ఆడియన్స్ లో ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకున్న హీరోలలో ఒకరు అడివి శేష్(Adivi Sesh). అలాంటి హీరో గత నాలుగేళ్ల నుండి ఒక్క సినిమా కూడా విడుదల చేయకపోవడం గమనార్హం. హడావిడిగా సినిమాలు చేసి , ఫ్లాపులు అందుకోవడం కంటే , నిదానంగా సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ ని అందుకోవడం పైనే ఈయన ద్రుష్టి సారించాడు కాబట్టి, ఇన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఆయన హీరో గా నటించిన ‘డెకాయిట్ : ఒక ప్రేమ కథ'(Dacoit Movie) చిత్రం ఈ నెల 10 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించగా, నేడు ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అడివి శేష్ మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ముఖ్యంగా బాహుబలి సినిమాలో నటిస్తున్నప్పుడు అనుష్క తో తనకు ఎదురైనా ఒక సందర్భం గురించి చెప్పుకొచ్చాడు అడివి శేష్. ఆయన మాట్లాడుతూ ‘ అనుష్క ని అందరూ స్వీటీ అని పిలుస్తుంటారు. నిజంగా ఆమె వ్యక్తిత్వాన్ని చూసే ఆ పేరు పెట్టారని నాకు అనిపిస్తూ ఉంటుంది, అంత మంచి అమ్మాయి. ఆ చిత్రం లో అనుష్క ఖైదీ గా పడి ఉన్నప్పుడు నేను కట్టెలతో కొట్టి నిద్ర లేపుతాను. ఆ సన్నివేశానికి సంబంధించిన చిత్రీకరణ పూర్తి అవ్వగానే నీకు గట్టిగా ఏమి తగల్లేదు కదా ? అడిగాను. ఎందుకంటే అంతకు ముందు నా వల్ల అనుష్క కి దెబ్బ తగిలింది. ఒక షాట్ లో నేను నా కాలితో అనుష్క ని గట్టిగా తన్నాలి ఉంటుంది. ఆ సన్నివేశం చేసిన తర్వాత అనుష్క మెడ నొప్పితో చాలా బాధ పడింది’.

‘ఆమె కళ్ళలో నుండి నీళ్లు కూడా తిరిగాయి. నిజానికి ముందుగా నేను చాలా సున్నితంగానే కొట్టాను , కానీ రాజమౌళి సార్ అది అసలు సరిపోదన్నారు. దీంతో నేను గట్టిగా కొట్టాల్సి వచ్చింది. దాని వల్ల ఆమెకు చాలా పెద్ద దెబ్బ తాకింది. ఆమెతో నేను తొలిసారి మాట్లాడిన క్షణాలు కూడా అవే’ అంటూ చెప్పుకొచ్చాడు అడివి శేష్. బాహుబలి చిత్రం లో భళ్ళాలదేవ కుమారుడిగా , భద్రుడిగా అడివి శేష్ ఎంత గొప్పగా నటించాడో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోనే ఆయన చివరిగా నెగెటివ్ క్యారెక్టర్ లో కనిపించాడు. ఆ తర్వాత ఆయన పూర్తి స్థాయి హీరో గా మారిపోయాడు. హీరో గా వరుస విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న అడివి శేష్ , ‘డెకాయిట్’ చిత్రంతో తన జైత్ర యాత్ర ని కొనసాగిస్తాడో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper