Homeఉద్యోగాలుAmazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ సంచలన నిర్ణయం.

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా ఇంత ఆదాయం వస్తే ఎవరైనా వదులుకుంటారా.. కానీ ఇందులో మాత్రం తమకు వచ్చే డబ్బు కంటే మానసిక ప్రశాంతతే ముఖ్యమని అనుకున్నారు.. దీంతో నగరాలను వదిలి సొంత పట్టణానికి తరలి వెళ్లారు. ప్రస్తుతం ఆదాయం తక్కువగా వస్తున్నా.. ఎంతో సంతోషంగా ఉన్నామని చెబుతున్నారు. […]

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా ఇంత ఆదాయం వస్తే ఎవరైనా వదులుకుంటారా.. కానీ ఇందులో మాత్రం తమకు వచ్చే డబ్బు కంటే మానసిక ప్రశాంతతే ముఖ్యమని అనుకున్నారు.. దీంతో నగరాలను వదిలి సొంత పట్టణానికి తరలి వెళ్లారు. ప్రస్తుతం ఆదాయం తక్కువగా వస్తున్నా.. ఎంతో సంతోషంగా ఉన్నామని చెబుతున్నారు. ఇంతకీ ఇంత భారీ జీతం వదులుకున్న ఆమె ఎవరు? ఎందుకు సొంత పట్టణానికి వెళ్లాల్సి వచ్చింది?

ప్రస్తుత కాలంలో లక్షల్లో జీతం కావాలని కోరుకునే వారి సంఖ్య చాలా ఎక్కువే. కానీ ఇలాంటి ఆదాయం రావాలంటే సొంత వారిని వదిలి ఇతర ప్రాంతాలకు వదిలి వెళ్లాల్సి ఉంటుంది. కానీ జీవితంలో డబ్బు కంటే ముఖ్యం కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం.. మానసికంగా సంతోషంగా ఉండడం అని నాసిక్ చెందిన సాన్యా దేశముఖ్ తెలుపుతోంది. ఎందుకంటే ఆమె మంచి ఉద్యోగాన్ని వదిలి ఇప్పుడు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటుంది.

సాన్యా దేశముఖ్ గతంలో ప్రముఖ కంపెనీ ఆమెజాన్ లో డిజిటల్ మార్కెటింగ్ రంగంలో పనిచేశారు. ఈ క్రమంలో ఆమె ఏడాదికి 30 నుంచి 35 లక్షల రూపాయల వేతనాన్ని పొందేవారు. ఆమె భర్త కూడా మంచి ఉద్యోగాన్ని చేయడంతో ఇద్దరు కలిపి ఏడాదికి రూ. 65 లక్షల వరకు ఆదాయాన్ని పొందేవారు. అయితే సాన్యా దేశముఖ్ ముంబైలో ఉద్యోగం చేస్తున్న సమయంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనేవారు. మొదట్లో హైబ్రిడ్ వర్క్ కల్చర్ ఉండడంతో కొంత సౌకర్యంగా ఉండేది. కానీ ఆ తర్వాత వారంలో ఐదు రోజులు కార్యాలయాలనుంచే పని చేయాలన్న నిబంధన రావడంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనేవారు.

అంతేకాకుండా ఉద్యోగంలో కూడా అధిక ఒత్తిడి కలిగి ఉండడంతో తీవ్ర మానసికవేదనను పొందేవారు. ఒకవైపు ఉద్యోగం ఒత్తిడి మరోవైపు వద్దనుకుంటే ఆదాయం పోతుందని ఆందోళన రెండు ఇబ్బంది పెట్టేవి. ఇంకోవైపు కుటుంబ సభ్యులతో కలిసి ఉండలేకపోవడంతో మరింత మానసిక వేదనకు గురయ్యేవారు. పండుగలు ఇతర సందర్భాల్లో ఏమాత్రం సెలవులు దొరకకపోవడంతో ఆమె మరింత నిరాశకు గురయ్యే వారు. అయితే ఉద్యోగంలో కూడా ఎదుగుదల లేదని తెలుసుకున్న ఆమె దీనిని వదులుకోవడమే ఉత్తమని భావించి గుడ్ బాయ్ చెప్పారు.

నాసిక్ వెళ్లిన తర్వాత ఆమె మరో వ్యాపార భాగస్వామితో కలిసి సొంతంగా డిజిటల్ మార్కెటింగ్ వెంచర్ ను ప్రారంభించారు. ఇప్పుడు ఆమె గతంలో కంటే ఆదాయం తక్కువగా పొందిన కూడా.. ఎంతో మానసిక ప్రశాంతతతో ఉన్నట్లు తెలుపుతున్నారు. అంతేకాకుండా భర్తతో కలిసి ఆమె ఉల్లాసంగా ఉంటున్నట్లు సోషల్ మీడియాలో తెలుపుతున్నారు. అయితే గతంలో ప్రయాణాలు ఇబ్బంది కావడంతో ముంబైలోనే కొన్ని రోజులపాటు జీవించారు. ఈ క్రమంలో ఆమెకు అధికంగా ఖర్చులు అయ్యేవి. కానీ ఇప్పుడు ఎలాంటి ఖర్చు లేకుండా సంతోషంగా ఉంటున్నట్లు ఆమె తెలిపారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper