Stay healthy tips: మానవ జీవితం కష్టసుఖాలను కలిగి ఉంటుంది. ఎప్పుడు కష్టం వస్తుందో? ఎప్పుడు సంతోషంగా ఉంటాము? ఎవరు చెప్పలేరు. కానీ కొన్ని రకాల కష్టాలకు.. కొన్ని రకాల సంతోషాలకు మనమే కారణం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మనుషులు చేసే కొన్ని పనులతోనే కష్టసుఖాలు ఉంటాయి అనేది జీవిత సత్యం. అది ఇప్పటివరకు చాలామంది జీవితాల్లో నిరూపణ అయింది.. ముందు ముందు కూడా అలాగే జరుగుతుంది. అయితే సంతోషం గురించి ఎవరు మాట్లాడుకోరు. కష్టం గురించి ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు. ఈ కష్టంలో భాగంగా ఆసుపత్రికి కూడా వెళ్లాల్సి వస్తుంది. మరి ఈ ఆసుపత్రి అవసరం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలా నడుచుకోవాలి?
Also Read: సూర్యుడే లేడు మరి విటమిన్ డి ఎలా?
మనిషి కోరికే కష్టసుఖాలకు కారణం అని ఆధ్యాత్మిక శాస్త్రం తెలుపుతుంది. ఎక్కువ కోరికలు ఉన్నవారు కాస్త ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఉన్నదాంట్లో సంతృప్తి తో ఉన్నవారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. అలాగాని ఏ పని చేయకుండా ఉండాలని కాదు. చేతిలో ఉన్న పనిని పూర్తి చేస్తే చాలు. కొత్త పని కోసం.. చేయలేని పని కోసం ఆరాటపడడం సమయం వృధా అవుతుంది. అయితే వృధా కాకుండా జీవితం సంతోషంగా ఉండాలంటే ఈ మూడు పనులను చేయాలి.
ఒక ఉద్యోగి తనకు వచ్చే జీతం కంటే ఎక్కువ కావాలని ఆశిస్తాడు. అయితే చేతిలో ఉన్న పని సమర్థవంతంగా చేయడం వల్ల అందులో విజయాన్ని పొందుతాడు. ఆ తర్వాత తనకు అవకాశాలు వస్తూ ఉంటాయి. అలా కాకుండా చేతిలో ఉన్న పనిని మధ్యలో ఆపివేసి కొత్త పని కోసం ఎదురు చూడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఉదాహరణకు ఒక ఉద్యోగికి ఒక కంపెనీలో లక్ష రూపాయల జీతం వస్తుందని అనుకుందాం. అయితే ఉద్యోగం జాయిన్ అయినా ఆరు నెలల లోపే అతనికి రెండు లక్షల జీతంతో మరో కంపెనీలో ఆఫర్ వచ్చింది. ఈ సమయంలో ఉద్యోగి ఉన్న కంపెనీని విడిచిపెట్టి రెండు లక్షల ఆఫర్కు వెళ్లడం ద్వారా.. తన జీవితం అగమ్య గోచరంగా మారే అవకాశం ఉంది. తాను చేపట్టిన మొదటి ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత మరో కంపెనీ గురించి ఆలోచించాలి. కానీ ఇక్కడే తన ప్రతిభ నిరూపించుకోనప్పుడు వేరే కంపెనీలో ఎలా నిరూపించుకుంటావు? అన్న ప్రశ్న ఎదురవుతుంది.
అతి ఆశ ఎప్పటికీ అనర్ధమే అనే సామెత అందరికీ తెలిసిన విషయమే. అయితే కొందరు తమకు ఉన్న సంపద కాకుండా ఎక్కువ కావాలని నిద్రాహారాలు మాని పనిచేస్తూ ఉంటారు. అలా పనిచేయడం వల్ల వారికి అనారోగ్యమే ఎదురవుతుంది. అదే ఉన్న సంపదలో సంతృప్తిగా ఉండడం వల్ల ఎంతో హాయిగా ఉంటుంది. అయితే సంపద పెంచుకోవాలనే ఉద్దేశం ఉన్నప్పుడు అది ధర్మబద్ధమైనదిగా ఉండాలి. ఏదో కావాలన్న ఆశతో అక్రమ మార్గంలో వెళ్లకుండా ఉండాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది.
Also Read: జనాభా సంక్షోభాన్ని నివారించడానికి పథకం.. బిడ్డకు జన్మనిస్తే 1.30 లక్షలు ఇస్తారట..
మనిషి ఎప్పుడూ పనుల విషయం మాత్రమే కాకుండా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకరోజులో ఎంత భాగం పనిచేస్తున్నామో.. అంతే భాగం ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. అలా ఆలోచించకుండా మిగతా విషయాలపై ఆరాటపడితే శరీరం అలసిపోయి మిగతా పనులకు సహకరించకుండా ఉంటుంది. ఇలా ఈ మూడు పనులను సక్రమంగా చేయగలిగితే ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండగలుగుతారు.