Homeజాతీయ వార్తలుSuvendu Adhikari PA: బెంగాల్లో ఘోరం: సువేందు అధికారి పీఏ పై దారుణం వారి పనేనా..

Suvendu Adhikari PA: బెంగాల్లో ఘోరం: సువేందు అధికారి పీఏ పై దారుణం వారి పనేనా..

Suvendu Adhikari PA: బెంగాల్లో దాదాపు దశాబ్దాల ఎదురుచూపు తర్వాత బిజెపి అధికారంలోకి వచ్చింది. సహజంగానే బెంగాల్లో వర్గ రాజకీయాలు అధికంగా ఉంటాయి. గతంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నప్పుడు వీటికి బీజం పడింది. మమత ముఖ్యమంత్రి అయిన తర్వాత అది తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో బిజెపి అధికారం దక్కించుకున్న తర్వాత బెంగాల్లో పరిస్థితులు మారిపోతాయి.. హింస చెలరేగుతుందని అందరూ అంచనా వేశారు. ఎన్నికల సమయంలో కేంద్ర బలగాలు పకడ్బందీగా వ్యవహరించడంతో హింస అంతగా చోటు చేసుకోలేదు. కానీ ఎన్నికల్లో బిజెపి గెలిచిన తర్వాత అక్కడ పరిణామాలు దారుణంగా మారిపోతున్నాయి.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల అనంతరం కూడా హింస చోటుచేసుకుంటున్నది. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న సువేందు అధికారి వ్యక్తిగత కార్యదర్శి చంద్రనాథ్ బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయనను ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్ గ్రామ్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత సమీపం నుంచి ఆయన మీద కాల్పులు జరిపారు. అందరూ చూస్తుండగానే.. నడిరోడ్డు మీద కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలైన అతడిని స్థానికంగా ఉన్న కొంతమంది ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన చనిపోయారు.

చాలాకాలంగా చంద్రనాథ్ సువేందు వద్ద అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన అనంతరం పోలీసులు అక్కడికి చేరుకున్నారు.. దర్యాప్తు మొదలుపెట్టారు. కాల్పులకు పాల్పడిన వారి ఆచూకీ గురించి గాలిస్తున్నారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత బిజెపి నాయకులు తీవ్రస్థాయిలో ఆరోపణ మొదలుపెట్టారు. ఇదంతా కూడా టీఎంసీ గూండాల పని అని ఆరోపించారు. దోషులను పట్టుకుంటామని.. కచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు..

బెంగాల్ రాష్ట్ర రాజధానిలో మాంసం దుకాణాలను కొంతమంది బుల్డోజర్లతో తొలగించారని.. ఇది బిజెపి కార్యకర్తల పని అని టీఎంసీ ఆరోపించింది. అయితే ఆ పార్టీ కార్యకర్తలే బిజెపి జెండాలతో ఈ చర్యకు పాల్పడ్డారని కమలం నాయకులు ఎదురుదాడికి దిగారు. ఈ ఘటన తర్వాతనే సువేందు అధికారి పిఏ హత్య జరగడం గమనార్హం. ఈ ఘటన అనంతరం కోల్కతా నగరంలో హింసకు పాల్పడుతున్న ఎమ్మెల్యే మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పరిస్థితులను ఒక్కసారిగా ఉద్రిక్తంగా మార్చింది. మరోవైపు ఈ నెల 9న కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఇతర బిజెపి నాయకులు హాజరు కాబోతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper