Homeజాతీయ వార్తలుTamil Nadu Politics: తమిళనాడు అధికారుల కీలక నిర్ణయం.. కాన్వాయ్ తొలగింపు.. విజయ్ లో తీవ్ర...

Tamil Nadu Politics: తమిళనాడు అధికారుల కీలక నిర్ణయం.. కాన్వాయ్ తొలగింపు.. విజయ్ లో తీవ్ర అసహనం..

Tamil Nadu Politics: తమిళనాడు ఎన్నికల్లో ఇటీవల విడుదలైన ఫలితాలలో అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా టీవీకే నిలిచింది. అయితే మ్యాజిక్ ఫిగర్ కు దూరంగా ఉండిపోయింది. ఈ నేపథ్యంలో విజయ్ ఎలాగైనా సరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఆయనకు తమిళనాడు అధికారులు సీఎం స్థాయిలో భద్రత కల్పించారు. నిన్న గవర్నర్ ను కలిసేందుకు విజయ్ వెళ్లినప్పుడు ఆయనకు అధికారులు సీఎం లెవెల్ లో సెక్యూరిటీ కల్పించారు. ఆ సెక్యూరిటీతో విజయ్ మాస్ లెవెల్లో గవర్నర్ వద్దకు వెళ్లారు.

విజయ్ అంచనా వేసినట్టుగా గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ఓకే చెప్పలేదు. ఎందుకంటే విజయ్ వద్ద మ్యాజిక్ ఫిగర్ కు అనుగుణంగా ఎమ్మెల్యేలు లేకపోవడంతో గవర్నర్ అనుమతి నిరాకరించారు. దీంతో విజయ ప్రమాణస్వీకారం ఆగిపోయింది. ఈ క్రమంలోనే అన్నా డీఎంకే, డీఎంకే, నేతల ఆధ్వర్యంలో గవర్నమెంట్ సెటప్ అవుతుందని వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ అవసరం లేకుండా.. బిజెపి సపోర్ట్ లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కొంతమంది నేతలు మీడియాకు లీకులు ఇచ్చారు. అంతేకాదు, దీంతో తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. ద్రవిడ సిద్ధాంతాన్ని ప్రజల్లో సజీవంగా ఉంచేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని రెండు పార్టీలకు సంబంధించిన నేతలు కొంతమంది మీడియా ప్రతినిధులకు చెప్పారు.

అన్న డీఎంకే, డీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు తగ్గట్టుగా ఎమ్మెల్యేల బలం ఆ రెండు పార్టీలకు లేదు. మళ్లీ వామపక్షాలు.. ఇతర పార్టీల సపోర్ట్ తీసుకోవాలి. వామక్షాలు ఇప్పటికే బెట్టు చేస్తున్నాయి. ఇవన్నీ కూడా తమిళనాడు రాజకీయాలను సంచలనంగా మార్చేస్తున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత విజయ్ లో అసహనం పెరిగిపోయింది.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఎమ్మెల్యేల బలం లేకపోవడం.. గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఒప్పుకోకపోవడం.. ప్రమాణ స్వీకారం రద్దు కావడంతో తమిళనాడు ప్రభుత్వ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయ్ కి కల్పించిన సీఎం సెక్యూరిటీని తొలగించారు. నిన్న గవర్నర్ వద్దకు సీఎం లెవెల్ లో వచ్చిన విజయ్.. తిరుగు ప్రయాణంలో కాన్వాయ్ లేకుండానే వెళ్లిపోయారు. ఆ సమయంలో ఆయన తీవ్ర అసహనంతో కనిపించారు. ముఖంలో బాధ స్పష్టంగా దర్శనమిచ్చింది. తమిళ రాజకీయాలు ఇలా ఉంటాయని విజయ్ కి ఇప్పుడు అర్థమై ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper