Homeజాతీయ వార్తలుWest Bengal election battle: బెంగాల్‌ ఎన్నికల యుద్ధం.. పాలకులను నిర్ణయించేంది వారే!

West Bengal election battle: బెంగాల్‌ ఎన్నికల యుద్ధం.. పాలకులను నిర్ణయించేంది వారే!

West Bengal election battle: సరిగ్గా నెల రోజుల తర్వాత ఎన్నికలు జరుగనున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ నాలుగోసారి విజయం సాధించాలనిచూస్తోంది. బీజేపీ త్రణమూల్‌కు బ్రేక్‌ వేయాలని చూస్తోంది. బెంగాల్‌ రాజకీయాలను శాసించే కీలకమైన శక్తి ముస్లిం సమాజం. బెంగాల్‌ రాజకీయాలను ఏడు దశాబ్దాలుగా శాసిస్తున్నారు. రెట్టింపైన ముస్లిం ఓట్లు.. పశ్చిమ బెంగాల్‌లో ముస్లిం జనాభా 1951లో 19.6 శాతం ఉండేవారు. ప్రస్తుతం 33 శాతానికి పెరిగారు. అంటే దాదాపు రెంట్టింపు అయ్యారు. 85 స్థానాల్లో వీరే విజేతలను […]

West Bengal election battle: సరిగ్గా నెల రోజుల తర్వాత ఎన్నికలు జరుగనున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ నాలుగోసారి విజయం సాధించాలనిచూస్తోంది. బీజేపీ త్రణమూల్‌కు బ్రేక్‌ వేయాలని చూస్తోంది. బెంగాల్‌ రాజకీయాలను శాసించే కీలకమైన శక్తి ముస్లిం సమాజం. బెంగాల్‌ రాజకీయాలను ఏడు దశాబ్దాలుగా శాసిస్తున్నారు.

రెట్టింపైన ముస్లిం ఓట్లు..
పశ్చిమ బెంగాల్‌లో ముస్లిం జనాభా 1951లో 19.6 శాతం ఉండేవారు. ప్రస్తుతం 33 శాతానికి పెరిగారు. అంటే దాదాపు రెంట్టింపు అయ్యారు. 85 స్థానాల్లో వీరే విజేతలను నిర్ణయిస్తారు, మరో 30–40 సీట్లలో ప్రభావం చూపుతారు. మొత్తం 120 నియోజకవర్గాల్లో వారి ఆధిపత్యం రాజకీయాలను శాసిస్తుంది.

ఆ జిల్లాల్లో ప్రభావం..
ముర్షీదాబాద్‌లో 46 శాతం, మాల్దాలో 51 శాతం, పశ్చిమ దినాజ్‌పూర్‌లో 50 శాతం, వీర్‌భూమిలో 50 శాతం, దక్షిణ 24 పర్గణాల్లో 30 శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఈ ప్రాంతాల్లో 85 స్థానాల్లో ముస్లిం అభ్యర్థులనే పార్టీలు బరిలో దింపుతాయి. వారే గెలుస్తారు. మరో 30 స్థానాల్లో ముస్లింల మద్దతుతో ఇతర మతాల అభ్యర్థులు గెలుస్తారు. ముస్లింలు ఓట్లు వేయకుంటే ఓడిపోతారు.

చారిత్రక ఓటు మార్పులు
దేశ విభజన తర్వాత కాంగ్రెస్, తర్వాత కమ్యూనిస్టుల వైపు ముస్లిం ఓట్లు మళ్లాయి. భూసంస్కరణలు, పాఠ్యపుస్తకాల మార్పులు, ఓబీసీలో 66 ముస్లిం కులాలు చేర్చడం ద్వారా వారిని బలోపేతం చేశారు. 2011 నుంచి తృణమూల్‌ వైపు మళ్లారు. ఇటీవల 36 ఉపకులాలను బీసీలో చేర్చి 35 ముస్లింలవి, ఉర్దూ రెండో అధికారిక భాషగా గుర్తింపు, ఇమామ్‌లకు వేతనాలు ప్రకటించింది. 2006లో కమ్యూనిస్టులు 102, 2021లో ఖీMఇ 95 సీట్లు ఈ ఓట్లతోనే గెలిచాయి.

ముస్లిం పార్టీల సవాల్‌..
ఎంఐఎం, ఐఎస్‌ఎఫ్‌ (ఇమామ్‌ అబ్బాస్‌), ఆల్‌ జనతా ఉనయన్‌ (మాజీ ఎంపీ ప్రారంభం) పార్టీలు ఈసారి అభ్యర్థులను పోటీలో దించాయి. ముస్లిం బలంగా ఉన్న ప్రాంతాల్లో వీటి ప్రభావం టీఎంసీ సీట్లను 20 వరకు తగ్గించే అవకాశం ఉంది.

ఈసారి ఎన్నికల్లో టీఎంసీకి బీజేపీ బ్రేక్‌ చేయాలని చూస్తోంది, ముస్లిం ఓట్ల చీలిక ఇందుకు దోహదపడే అవకాశం ఉంది. 20 మంది ముస్లింలు గెలిస్తే ఫలితాలు మారతాయి. ముస్లిం పార్టీల పోటీ ఓటు బ్యాంకును విభజించి, బెంగాల్‌ రాజకీయాల్లో కొత్త అధ్యాయం రాస్తాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper