Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan fire on Peddi movie team: 'పెద్ది' మూవీ టీం పై పవన్...

Pawan Kalyan fire on Peddi movie team: ‘పెద్ది’ మూవీ టీం పై పవన్ కళ్యాణ్ ఫైర్.. వణికిపోయిన డైరెక్టర్ బుచ్చి బాబు!

Pawan Kalyan fire on Peddi movie team: రాజకీయాల్లో ఫుల్ బిజీ గా ఉన్న పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) , తనకు ఎలాంటి సంబంధం లేని ‘పెద్ది'(Peddi movie)మూవీ టీం పై ఎందుకు అంత ఫైర్ అయ్యాడు?, అంత అవసరం ఏమొచ్చింది అని ఇప్పుడు సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. అయితే అసలు విషయం లోకి వెళ్తే , మొన్న షూటింగ్ జరగుతున్న సమయం లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నుదుటి పై గాయం అవ్వడం, ఆయన్ని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లడం , అక్కడ ఆయనకు నాలుగు కుట్లు పడడం వంటివి అభిమానులను కంగారుకి గురి చేశాయి. అంతే కాకుండా ఏప్రిల్ 30 న విడుదల టార్గెట్ పెట్టుకొని శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ కి గాయం అవ్వడం తో షూటింగ్ ఆగిపోయింది. మరి ఇప్పుడు సినిమాని అనుకున్న తేదికి విడుదల చేస్తారా లేదా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ కి రామ్ చరణ్ గాయాలపాలయ్యాడు, కుట్లు కూడా పడ్డాయి అనే విషయం తెలియగానే ‘పెద్ది’ మూవీ టీం కి ఫోన్ చేశాడు. ముందుగా డైరెక్టర్ బుచ్చి బాబు తో మాట్లాడుతూ ‘ఏమయ్యా.. చూసుకొని చెయ్యాలి కదా, కుట్లు పడేంత పెద్ద దెబ్బ తగిలే పరిస్థితి ఎందుకు వచ్చింది?, ఏర్పాట్లు పర్ఫెక్ట్ గా చెయ్యాలి కదా, ఎలాంటి అపాయం లేదు కాబట్టి సరిపోయింది, జరగరానిది జరిగుంటే ఏంటి పరిస్థితి ?’ అంటూ మండిపడ్డాడట. పవన్ కళ్యాణ్ మొదటిసారి తనతో మాట్లాడే సందర్భం ఇలా తిట్లతో మొదలు అవుతుందని అసలు అనుకోలేదని, బుచ్చి బాబు షాక్ కి గురై తన స్టాఫ్ తో చెప్పుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ మధ్య ఎలాంటి అనుబంధం ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

Also Read: ‘వారణాసి’ మూవీ కోసం రాజమౌళి రెమ్యూనరేషన్ మళ్ళీ పెంచాడు..జక్కన్న ముందు స్టార్ హీరోలు కూడా పనికిరారుగా…

వీళ్లిద్దరు బాబాయ్ , అబ్బాయ్ లాగా అసలు ఉండరు, సొంత తండ్రి కొడుకులు లాగా ఉంటారు. రామ్ చరణ్ కూడా చిన్న తనం లో తన తండ్రి దగ్గర కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ వద్దనే పెరిగాడు. చిరంజీవి షూటింగ్స్ తో బిజీ గా ఉన్న సమయం లో రామ్ చరణ్ బాగోగుల బాధ్యత పవన్ కళ్యాణ్ మీదనే ఉండేది. అలా చిన్నతనం నుండే వీళ్ళ మధ్య ఈ స్థాయి బంధం ఉండడం , ఆ బంధం తాలూకు ప్రేమ ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు బయటపడడం వంటివి జరుగుతూ ఉంటాయి. అభిమానులకు ఇలాంటివి ఎప్పటికీ మర్చిపోలేని తీపి జ్ఞాపకాలుగా చెప్పుకోవచ్చు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Hardik Pandya

Hardik Pandya: హార్దిక్ చెప్పినట్టు.. సీఎస్కే మేనేజ్మెంట్ ఆడుతోంది.. ఏం జరుగుతుందో..

Hardik Pandya: గొప్ప ఆటగాడే. గతంలో గుజరాత్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించాడు. మరోసారి ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. కానీ ఆ తర్వాత మనోడి ఆట మారిపోయింది. బౌలింగ్ తన స్థాయిలో...
RHA Movement

RHA Movement: దేశవ్యాప్తంగా మరో ఉద్యమం.. ఈసారి అదే లక్ష్యం!

RHA Movement: సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన కాక్రోచ్ వ్యాఖ్యల నుంచి పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మొన్నటి వరకు సోషల్ మీడియా వేదికగా ఉద్యమించిన సీజీపీ నీటి...
YSRCP Rayalaseema

YSRCP Rayalaseema: రాయలసీమలో వైసీపీకి కష్టమే!

YSRCP Rayalaseema: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ధీమా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని ఆ పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా రాయలసీమలో తమ పార్టీకి ఆదరణ పెరుగుతోందని.. పూర్వవైభవం ఖాయమని జగన్మోహన్...
AP MLC Elections 2026

AP MLC Elections 2026: రేపటితో ఆ ఇద్దరు.. ఏపీలో మొదలుకాని ఎమ్మెల్సీ ఎన్నికల సందడి!

AP MLC Elections 2026: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈనెల 28 తో గవర్నర్ కోటా కింద రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీకి సంబంధించి ఎన్నికల సంఘం...
Ellamma Cheruvu

Ellamma Cheruvu: కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కాదు.. తెలంగాణలో ఈ చెరువే దేశానికి ఆదర్శం

Ellamma Cheruvu: గోదావరి కిందికి పోతుంటే పైకి తీసుకొచ్చాం. వందల మీటర్లు గ్రావిటీకి వ్యతిరేకంగా ప్రవహించేలా చేసాం. లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. తాగునీటి అవసరాలు తీర్చాం. సాగునీటి అవసరాలు తీర్చాం....
Oktelugu Epaper