Homeజాతీయ వార్తలుVijay TVK: అడ్డి మారి గుడ్డి దెబ్బ కాదు.. విజయ్ "విజిల్ పోడు" కు ఒక్క...

Vijay TVK: అడ్డి మారి గుడ్డి దెబ్బ కాదు.. విజయ్ “విజిల్ పోడు” కు ఒక్క డిపాజిటూ పోలేదు..

Vijay TVK: తమిళనాడు ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ సొంతం చేసుకోలేకపోయినప్పటికీ.. అతిపెద్ద పార్టీగా టీవీ కే ఆవిర్భవించింది. తమిళనాడు రాజకీయ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. విజయ్ దూకుడు వల్ల ఆయన పోటీ చేసిన రెండు స్థానాలలో విజయం సాధించారు. అధికారానికి కొన్ని సీట్ల దూరంలో నిలిచినప్పటికీ.. అధికారాన్ని సొంతం చేసుకునే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు.. ఇప్పటికే తమిళనాడు గవర్నర్ కు విజయ్ లేఖ రాశారు. మరి కొద్ది రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతారు.

ఇప్పటికే తమిళనాడు పోలీసులు విజయ్ నివాసం వద్ద భద్రతను పెంచారు. సీఎం కాకముందే ఆయనకు కాన్వాయ్ ఏర్పాటు చేశారు. విజయ్ నివాసం ఉంటున్న ప్రాంతంలో పోలీసులు మూడు అంచల విధానంలో భద్రతను కొనసాగిస్తున్నారు.. విజయ్ మ్యాజిక్ ఫిగర్ సొంతం చేసుకోలేక పోయినప్పటికీ.. తమిళ రాజకీయాలలో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత.. ఏ పార్టీకి ఏ స్థాయిలో ఓట్లు వచ్చాయి అనేది ఎన్నికల సంఘం బయటపడుతుంది. ఆ వివరాల ప్రకారం టీవీ కే ఈసారి తమిళ ఎన్నికల్లో సరికొత్త ప్రభంజనం సృష్టించింది.

తమిళనాడు ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని అందుకున్న టీవీకే ఒక్క స్థానంలో కూడా డిపాజిట్ కోల్పోలేదు. పెద్ద పెద్ద పార్టీలకు సైతం డిపాజిట్లు దక్కకుండా పోతున్న రోజుల్లో.. టి వి కే పోరాడిన తీరు గొప్పగా అనిపిస్తోంది. గెలిచిన స్థానాలలో టీవీకే పార్టీ విన్నింగ్ మార్జిన్ సగటు 22, 842 ఓట్లుగా ఉండడం విశేషం. ఇదే సమయంలో అన్నా డీఎంకే 15, 164, డీఎంకే 9,310 కంటే కూడా టీవీ కే ఎక్కువ విన్నింగ్ మార్జిన్ సాధించడం విశేషం. ఒక్కో స్థానంలో సగటున డిఎంకె కంటే కూడా 2.5 రెట్లు ఎక్కువ మార్జిన్ తో టివికే ఘనవిజయం సాధించింది.. వాస్తవానికి ఈ ట్రెండ్ పొలిటికల్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. టీవీ కే సృష్టించిన సంచలనం తమిళ రాజకీయాలను కాదు, దేశ రాజకీయాలనే ఆలోచనలో పడేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

“పార్టీ పెట్టి సరిగ్గా రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. క్షేత్రస్థాయిలో నిర్మాణం కూడా అంత గొప్పగా సాగినట్లు కనిపించడం లేదు. డీఎంకే కూడా పంచే పథకాలకు భారీగా శ్రీకారం చుట్టింది. క్షేత్రస్థాయిలో డీఎంకేకు బలమైన ఓటర్లు ఉన్నారు. అన్నా డీఎంకే స్థాయిని తక్కువ అంచనా వేయడానికి లేదు. అటువంటిది టీవీకే మెరుపు వేగంతో తమిళ రాజకీయాల్లోకి వచ్చేసింది. అంతే వేగంతో అధికారాన్ని అందుకుంది. డబ్బు పంచకుండా.. విమర్శలు చేయకుండా టీవీకే అధికారంలోకి వచ్చింది. రాజకీయాలలో ఇది కొత్త ఒరవడి” అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper