Homeజాతీయ వార్తలుCM Vijay: లోకేష్ బాటలో విజయ్.. తమిళనాడులో ఏపీ మాదిరిగానే..

CM Vijay: లోకేష్ బాటలో విజయ్.. తమిళనాడులో ఏపీ మాదిరిగానే..

CM Vijay: మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం కదా.. ఏపీ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారని.. అవి సరికొత్త మార్పులకు నాంది పలుకుతున్నాయని.. నారా లోకేష్ తీసుకొచ్చిన నూతన విధానాలు ఏపీ రాష్ట్రాన్ని గేమ్ చేంజర్ లాగా మారుస్తున్నాయి. భారత దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరికొత్త గుర్తింపును తీసుకొస్తున్నాయి. ఇప్పుడు ఇదే దారిని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అనుసరిస్తున్నారు. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చూపించిన తోవలో నడుస్తున్నారు. ఏపీ బాటలోనే […]

CM Vijay: మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం కదా.. ఏపీ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారని.. అవి సరికొత్త మార్పులకు నాంది పలుకుతున్నాయని.. నారా లోకేష్ తీసుకొచ్చిన నూతన విధానాలు ఏపీ రాష్ట్రాన్ని గేమ్ చేంజర్ లాగా మారుస్తున్నాయి. భారత దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరికొత్త గుర్తింపును తీసుకొస్తున్నాయి.

ఇప్పుడు ఇదే దారిని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అనుసరిస్తున్నారు. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చూపించిన తోవలో నడుస్తున్నారు. ఏపీ బాటలోనే తన రాష్ట్రాన్ని కూడా నడిపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో.. క్లాస్ రూమ్ లలోకి రాజకీయ కార్యకర్తలు ప్రవేశించకూడదు. ప్రవేట్ వ్యక్తులు ఎంట్రీ ఇవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో విద్యాలయాల్లో ప్రైవేట్ కార్యక్రమాలు.. రాజకీయ కార్యక్రమాలు జరగకూడదు. కేవలం ఎన్నికైన నాయకులకు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలోకి అనుమతి ఉంటుంది. ప్రైవేట్ విద్యాలయాలలోకి ఎంట్రీ ఉంటుంది. ఇదే నిబంధన తీసుకొచ్చి నారా లోకేష్ ఏపీ విద్యాశాఖలో సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టారు.

ఇప్పుడు ఇదే మార్పును తమిళనాడులో అమలు చేస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఏపీ రాష్ట్ర మాదిరిగానే సరికొత్త నిబంధనలు తెరపైకి తీసుకువచ్చారు. విద్యాలయాలను రాజకీయ అనుకూల కార్యక్రమాలకు దూరంగా ఉండేలా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా అక్కడ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యావేత్తలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల విద్యాలయాలలో రాజకీయ కార్యక్రమాలు జరగవని.. తద్వారా విద్యార్థులకు స్వేచ్ఛాయుత విధానంలో చదువుకునే అవకాశం ఉంటుందని విద్యావేత్తల అభిప్రాయపడుతున్నారు.

విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. కేవలం ఆంధ్రప్రదేశ్.. తమిళనాడులో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి విధానాన్ని తీసుకురావాలని.. రాజకీయాలకు విద్యాలయాలను దూరంగా ఉంచాలని.. విద్యార్థులకు స్వేచ్ఛతో కూడిన విద్యను అందించాలని.. అప్పుడే యువతరం బాగుపడుతుందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. విజయ్ తీసుకున్న నిర్ణయం తమిళనాడులో సరికొత్తమార్పులకు నాంది పలుకుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విజయ్ ఎన్నికల్లో చెప్పినట్టుగా తమిళనాడు రాజకీయాల్లో మార్పు తీసుకొస్తున్నారని..ఇది ఇలాగే కొనసాగాలని అక్కడి ప్రజల అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper