Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Jail: చంద్రబాబుకు దక్కని ఊరట.. ఎల్లుండి వరకు వెయిటింగ్ తప్పదు

Chandrababu Jail: చంద్రబాబుకు దక్కని ఊరట.. ఎల్లుండి వరకు వెయిటింగ్ తప్పదు

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ ను ఏసీబీ కోర్టు తోసి పుచ్చిన నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ వాయిదా పడుతూ వస్తోంది.

Chandrababu Jail: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి దాదాపు 36 రోజులు కావస్తోంది. న్యాయస్థానాల్లో ఆయనకు ఊరట దక్కడం లేదు. హైకోర్టు, విజయవాడ ఏసిబి కోర్టులో ఆయన దాఖలు చేసుకున్న రెండు కీలక పిటిషన్లపై విచారణ ముందుకు సాగలేదు. విచారణలు వాయిదా పడ్డాయి. చంద్రబాబు ఎల్లుండి వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. సుప్రీంకోర్టులో మాత్రం చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై మధ్యాహ్నం విచారణ జరగబోతోంది.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ ను ఏసీబీ కోర్టు తోసి పుచ్చిన నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ వాయిదా పడుతూ వస్తోంది. ఇవాళ కూడా మరోసారి విచారణ ప్రారంభమైంది. ఇరువర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అయితే దీనిపై ఎటూ తేల్చని హైకోర్టు ధర్మాసనం విచారణను ఎల్లుండికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పై విచారణ జరగనున్న నేపథ్యంలోనే హైకోర్టు పెండింగ్ పెట్టినట్టు తెలుస్తోంది.

మరోవైపు విజయవాడ ఏసిబి కోర్టులో చంద్రబాబు న్యాయవాదులు ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు హెల్త్ అప్డేట్స్ ఇవ్వాలని కోరారు. దీని విచారణకు స్వీకరించిన ఏసీబీ కోర్టు ఈరోజు వాదనలను ప్రారంభించింది. అయితే దీనిపై సిఐడిని కౌంటర్ దాఖలు చేయాలని సూచిస్తూ విచారణను వాయిదా వేసింది. సిఐడి నుంచి కౌంటర్ దాఖలు చేశాక విచారణ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో చంద్రబాబు హెల్త్ అప్డేట్స్ విషయంలోనూ కూడా ఊరట దక్కలేదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper