spot_img
Homeఆంధ్రప్రదేశ్‌స్థానిక సమస్యలే ఎజెండాగా ఓట్లు..!.. వైసీపీ క్లీన్‌ స్వీప్‌

స్థానిక సమస్యలే ఎజెండాగా ఓట్లు..!.. వైసీపీ క్లీన్‌ స్వీప్‌

YCP
ఓటర్లను ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఒక్కసారి వారికి ఆ పార్టీ కానీ.. ఆ పార్టీ లీడర్ నచ్చితే అక్కున చేర్చుకుంటారు. లేదంటే గుణపాఠం చెప్తారు. నిన్న ఏపీలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో మరోసారి అదే రుజువైంది. స్థానిక ఎన్నికలను రాష్ట్ర స్థాయి అంశాలకు ముడిపెట్టి.. ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేద్దామనుకున్న విపక్ష పార్టీలకు గట్టిగా షాక్ ఇచ్చారు. తమ ఇంటి ముందు సిమెంట్ రోడ్డు.. తమ డ్రైనేజీ సమస్య.. తమ ప్రభుత్వ పథకాల గురించి మాత్రమే వారు ఆలోచించారు. వాటినే ఓట్లుగా భావించారు. అదే ఎజెండాతో ఓటింగ్ చేశారు. ఫలితంగా.. రాజధాని, స్టీల్ ప్లాంట్ శాంతిభద్రతలు అంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేయబోయిన విపక్షాలకు దిమ్మతిరిగినట్లయింది.

Also Read: విద్యుత్ రంగంలో తెలంగాణ అద్భుత విజయాలు

రాజధాని సెంటిమెంట్, స్టీల్ ప్లాంట్ ఉద్యమం.. శాంతిభద్రతలు ఇలా అనేక అంశాలపై విపక్షాలు ఆశలు పెట్టుకున్నాయి. కానీ.. ఏపీలోని కార్పొరేషన్లలో నివాసం ఉంటున్న వారు మాత్రం అధికార పార్టీకి పట్టం కడితేనే అభివృద్ధి జరుగుతుందని ఆశించారు. ఫలితాలు దానికి తగ్గట్లుగానే వచ్చాయి. రాజధాని సెంటిమెంట్ అంటూ విజయవాడ, గుంటూరు ప్రజల్ని ఎమోషనల్ టచ్ చేసేందుకు ప్రయత్నించడం.. విశాఖ స్టీల్ ప్లాంట్ పేరుతో.. అక్కడ ఓటర్లను టార్గెట్ చేయడంతో ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారా అన్న ఆసక్తి రాష్ట్రమంతటా ఏర్పడింది.

అయితే.. ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీకే మొగ్గు కనిపించింది. రాష్ట్ర స్థాయి అంశాలకు కార్పొరేషన్ ఎన్నికలతో రాజకీయ పార్టీలు ముడి పెట్టినా ప్రజలు మాత్రం స్థానిక అంశాలకే ప్రాధాన్యం ఇచ్చారు. నగర ప్రజలు స్థానిక ఎన్నికలను స్థానిక ఎన్నికలుగానే చూశారు. రాష్ట్ర అంశాలకు తమ ఓటింగ్‌లో ప్రయారిటీ కల్పించలేదు. అధికార పార్టీకి ఓటు వేస్తే.. సంక్షేమ పథకాలకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవడంతో పాటు.. తమ వార్డులో అభివృద్ధి పనులు కూడా జరుగుతాయని జనం ఆశించారు. ఆ విషయం ఫలితాల సరళితో తేలిపోయింది. మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి కనిపించింది. ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం అనే తేడా లేకుండా ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ అధికార పార్టీనే కనిపించింది.

Also Read: ఆ సీటుపై వకీల్‌ సాబ్‌ సంజాయిషీ

స్థానిక ఎన్నికల ఫలితాలు.. అధికారంలో ఉన్న పార్టీకే అనుకూలంగా వస్తాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేవారు ఎవరూ అనుకోరు. ఈ సారి అధికార పార్టీ చాలా పక్కాగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను మ్యాపింగ్ చేసుకుంది. వాలంటీర్ల ద్వారా ఎవరు ఏ పార్టీ ఓటర్లో గుర్తించి.. వారికి వచ్చే పథకాల గురించి ముందుగానే హెచ్చరికలు పంపింది. దీంతో ఏకపక్ష విజయాలు నమోదయ్యాయనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఈ ఎన్నికల్లో ఓటర్ల అభిమానంతో ఫ్యాన్‌ హవానే కనిపించింది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Oktelugu Epaper