Homeజాతీయ వార్తలుVijay Tamil Nadu CM : హ్యాండిచ్చిన పార్టీలు.. 'దళపతి' విజయ్ కు అందని సీఎం...

Vijay Tamil Nadu CM : హ్యాండిచ్చిన పార్టీలు.. ‘దళపతి’ విజయ్ కు అందని సీఎం కుర్చీ

Vijay Tamil Nadu CM : తమిళనాడులో మరోసారి రాజకీయ హైడ్రామా నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న TVK అధినేత విజయ్ కు అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలింది. తొలుత TVKకు మద్దతు ప్రకటించిన IUML తాజాగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. మరోవైపు మద్దతు ఇస్తామని ప్రకటించిన VCK పార్టీ నుంచి గవర్నర్‌కు ఇప్పటివరకు అధికారిక లేఖ అందలేదు. దీంతో అసెంబ్లీలో TVK బలం ప్రస్తుతం 116 స్థానాలకు పరిమితమైంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే అవసరమైన మ్యాజిక్ […]

Vijay Tamil Nadu CM : తమిళనాడులో మరోసారి రాజకీయ హైడ్రామా నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న TVK అధినేత విజయ్ కు అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలింది. తొలుత TVKకు మద్దతు ప్రకటించిన IUML తాజాగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. మరోవైపు మద్దతు ఇస్తామని ప్రకటించిన VCK పార్టీ నుంచి గవర్నర్‌కు ఇప్పటివరకు అధికారిక లేఖ అందలేదు.

దీంతో అసెంబ్లీలో TVK బలం ప్రస్తుతం 116 స్థానాలకు పరిమితమైంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 కావడంతో ఇంకా రెండు సీట్ల మద్దతు అవసరంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా లేదా అన్నదానిపై మళ్లీ ఉత్కంఠ నెలకొంది.

అందుకే గవర్నర్ ఇప్పటివరకు అధికారికంగా ప్రభుత్వ ఏర్పాటుకు TVKను ఆహ్వానించలేదు. తమిళ రాజకీయాల్లో ఈ పరిణామాలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

అంతకుముందు.. తమిళనాడు లో గత రెండు మూడు రోజుల నుండి ఏర్పడిన రాజకీయ హై డ్రామా కి తెరపడింది. రేపటి నుండి తమిళనాడు లో విజయ్ సర్కార్ కొలువుతీరనుంది. ఎన్నికల్లో 107 స్థానాల్లో గెలుపొందిన విజయ్ కి , మ్యాజిక్ ఫిగర్ 118 కి చేరుకోవడం చాలా కష్టమైంది. డీఎంకే పార్టీ తో దశాబ్దాల నుండి ప్రయాణిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ , విజయ్ మద్దతు కోరిన పక్కరోజే తమకు వచ్చిన 5 ఎమ్మెల్యే స్థానాలను చేరుస్తు విజయ్ టీవీకే పార్టీ కి బలం చేకూర్చారు. దీంతో మిగిలిన 6 స్థానాలు సమకూర్చడం కోసం విజయ్ పాపం నానా తంటాలు పడాల్సి వచ్చింది. గవర్నర్ వద్దకు తమ దగ్గరున్న 112 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిని కోరాడు విజయ్. అందుకోసం ఆయన రెండు సార్లు గవర్నర్ ని కలిసాడు.

అసెంబ్లీ లో తమ మెజారిటీ ని నిరూపించుకుంటామని రిక్వెస్ట్ చేశారు. కానీ గవర్నర్ అందుకు ఒప్పుకోలేదు . మ్యాజిక్ ఫిగర్ 118 ఎమ్మెల్యేల సంతకాలు చూపిస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకి అనుమతిస్తామని తెగేసి చెప్పడం తో , రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు టీవీకే పార్టీ మద్దతుదారులు. అయితే ఎట్టకేలకు నేడు విజయ్ బలాన్ని సమకూర్చుకొని గవర్నర్ వద్దకు వెళ్ళాడు. మొదట్లో కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతు ఇవ్వడానికి ఒప్పుకోలేదు కానీ, నేడు వాళ్ళు విజయ్ కి మద్దతు ఇస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. దీంతో విజయ్ కూటమి బలాలు ఒకసారి చూస్తే టీవీకే పార్టీ కి 107 స్థానాలు , కాంగ్రెస్ పార్టీ కి 5 స్థానాలు, సీపీఐ 2 స్థానాలు , సీపీఎం 2 స్థానాలు , వీసీకే 2 స్థానాలు , IUML 2 స్థానాలు కాగా , ఓవరాల్ టీవీకే కూటమి బలం మ్యాజిక్ ఫిగర్ ని దాటి 120 కి చేరింది.

దీంతో గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకి అనుమతి ఇచ్చారు. రేపు వేలాది మంది అభిమానుల సమక్ష్యం లో ‘చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్’ అనే నేను తమిళనాడు ముఖ్యమంత్రిగా అంటూ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎన్నో కష్టాలు అనుభవించి , సీఎం సీటు మీద కూర్చోబోతున్న విజయ్ , రేపు చేయబోయే ప్రమాణస్వీకారోత్సవాన్ని అభిమానులు జీవితాంతం మర్చిపోలేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రభుత్వం లో కేవలం కాంగ్రెస్ పార్టీ , వీసీకే పార్టీలు మాత్రమే భాగం కాబోతున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు రెండు కూడా కేవలం మద్దతు ప్రకటించాయి కానీ , ప్రభుత్వం లో భాగం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీ కి రెండు మంత్రి పదవులు ఇవ్వడానికి విజయ్ అంగీకరించాడు, అదే విధంగా త్వరలో ఖాళీ కానున్న తిరుచ్చి స్థానాన్ని వీసీకే పార్టీకి ఇవ్వడానికి విజయ్ అంగీకరించాడు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper