Homeఎంటర్టైన్మెంట్Vijay CM Oath: విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాహుల్ గాంధీ కి అవమానం.. ఇలాంటి...

Vijay CM Oath: విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాహుల్ గాంధీ కి అవమానం.. ఇలాంటి పరిస్థితి ఊహించలేదు..

Vijay CM Oath: ఎట్టకేలకు భారీ పొలిటికల్ హై డ్రామా అనంతరం తమిళ హీరో విజయ్ కాస్త ఇప్పుడు సీఎం విజయ్ గా మారాడు. నేడు గవర్నర్ సమక్షం లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయనతో పాటు 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఘటన మొత్తం విజయ్ ఫ్యాన్స్ కి తిరుగులేని జ్ఞాపకం గా మారనుంది. ఒక సినిమా హీరో రాజకీయాల్లోకి వచ్చి, మొదటి ఎన్నికల్లోనే ముఖ్యమంత్రి అవ్వడం […]

Vijay CM Oath: ఎట్టకేలకు భారీ పొలిటికల్ హై డ్రామా అనంతరం తమిళ హీరో విజయ్ కాస్త ఇప్పుడు సీఎం విజయ్ గా మారాడు. నేడు గవర్నర్ సమక్షం లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయనతో పాటు 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఘటన మొత్తం విజయ్ ఫ్యాన్స్ కి తిరుగులేని జ్ఞాపకం గా మారనుంది. ఒక సినిమా హీరో రాజకీయాల్లోకి వచ్చి, మొదటి ఎన్నికల్లోనే ముఖ్యమంత్రి అవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు. తమిళనాడు లో పరిస్థితులు ఎలా ఉన్నా సరే, విజయ్ సృష్టించింది ఒక హిస్టరీ. కానీ ఆయన ప్రభుత్వాన్ని ఎలా నడుపుతాడు అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు , శత్రువులు ఉండరు అని అందరూ అంటుంటారు. ఎన్నికల ప్రచారం సమయం లో కాంగ్రెస్ ని అవినీతి పార్టీ అని దూషించి, ఇప్పుడు సీఎం అవ్వడం కోసం ఆ పార్టీ మద్దతు కోరడం విజయ్ చేసిన మొదటి పొరపాటు.

దశాబ్దాల నుండి డీఎంకే తో కూటమిలో కొనసాగుతూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ.. ఎన్నో కష్టపమైన సమయాల్లో డీఎంకే పార్టీ కాంగ్రెస్ కి అండగా నిల్చింది. నేడు కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ కి ప్రతిపక్ష హోదా దక్కిందంటే , అందుకు కారణం కూడా డీఎంకే పార్టీ నే. అలాంటి పార్టీ కి కూటమి సిద్ధాంతాలకు తూట్లు పొడుస్తూ , నీతి నియమాలను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ అవకాశం చూసుకొని నేడు విజయ్ టీవీకే తో జత కట్టింది. ఇది కచ్చితంగా ద్రోహం చేయడమే, విజయ్ అందుకు ప్రోత్సాహం కూడా అందించినట్టే లెక్క. అవకాశం చూసుకొని డీఎంకే పార్టీ కి వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్, రేపు విజయ్ టీవీకే పార్టీకి వెన్నుపోటు పొడవదు అని ఎలా అనుకుంటున్నారు?, కచ్చితంగా సమయం అనుకూలించకపోతే జరిగేది అదే.

ఇకపోతే నేడు విజయ్ ప్రమాణస్వీకారోత్సవానికి రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ ని టీవీకే పార్టీ నాయకులూ పట్టించుకోకపోవడం గమనార్హం. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నేరుగా విజయ్ వద్దకు వెళ్లి కృతఙ్ఞతలు తెలిపారు. కానీ విజయ్ నేడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడానికి కారణమైన రాహుల్ గాంధీ ని మాత్రం ఎవ్వరూ పట్టించుకోలేదు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. దీన్ని అన్ని ఇతర పార్టీల నాయకులూ ఒక రేంజ్ లో వైరల్ చేస్తూ రాహుల్ గాంధీ ని ట్రోల్ చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే భవిష్యత్తులో ఈ అతుకుల బొంత లాంటి ప్రభుత్వం ఎన్నో సమస్యలను ఎదురుకోవాల్సి వస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper