Homeజాతీయ వార్తలుHoney Trap: హనీ ట్రాప్‌లో పోలీస్‌ ఉన్నతాధికారి.. అసలు విషయం తెలిసి లబోదిబో

Honey Trap: హనీ ట్రాప్‌లో పోలీస్‌ ఉన్నతాధికారి.. అసలు విషయం తెలిసి లబోదిబో

Honey Trap: తెలంగాణ పోలీసులంటే.. హైటెక్‌ అని అందరూ చెప్పుకుంటుంటారు. సీసీ కెమెరాలు, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఇలా దేశానికే రోల్‌ మోడల్‌ అని ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేసుకుంటుంటారు. ఆ హైటెక్‌ వ్యవహారాన్ని ఓ టెకీ తుత్తునీయలు చేశాడు. అంతే కాదు ఓ పోలీస్‌ అధికారిని హనీ ట్రాప్‌లోకి లాగాడు. అంతే కాదు తనకు ఉన్న టెక్‌ పరిజ్ఞానంతో చుక్కలు చూపించాడు. దీంతో లబోదిబోమనడం ఆ అధికారి వంతయింది. అంతే కాదు ఈ వ్యవహారాన్ని పోలీస్‌ శాఖ అత్యంతగోప్యంగా ఉంచింది. రహస్యంగా విచారణ జరుపుతోంది.

తనపై అకారణంగా చేయిచేసుకున్న పోలీసు ఉన్నతాధికారికి ఓ ఐటీ ఉద్యోగి ఝలక్‌ ఇచ్చా డు. హైటెక్‌ పోలీసులుగా చెప్పుకొనే తెలంగాణ పోలీసు శాఖ కంగుతినేలా చేశాడు. ఆ అధికారి మొబైల్‌ ఫోన్‌ నంబర్‌ను సేకరించి, దాన్ని హ్యాక్‌ చేశాడా ఐటీ ఉద్యోగి. ఆ ఫోన్‌ను తన నియంత్రణలోకి తీసుకున్నాడు. అందులో ఉన్న ఇతరులతో చేసిన వాట్సాప్‌ చాటింగ్‌ డేటా.. వీడియోలు.. సోషల్‌ మీడియాలో చాటింగ్‌ వివరాలు.. ఇలా వ్యక్తిగ వివరాలను కొల్లగొట్టాడు.

తిరిగి ఆ అధికారికే..

తిరిగి ఆ అధికారికే ఆ వీడియోలను, మెసేజ్‌ల స్ర్కీన్‌షాట్లను పంపాడు. దీంతో.. కంగుతినడం ఆ అధికారి వం తైంది. ఇటీవల ఐటీ ఉద్యోగులు స్వచ్ఛందంగా ర్యాలీ నిర్వహిస్తుంటే.. పోలీసులు తమపై చేయిచేసుకున్నారంటూ ఐటీ ఉద్యోగులు చెబుతున్నారు. ఆరోజు తమ పట్ల దురుసుగా వ్యవహరించిన ప్రతి ఒక్క పోలీసు అధికారి, సిబ్బంది ఫోన్లలోని డేటాను బయటపెడతామని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఎలా చేశారు..?

పోలీసు ఉన్నతాధికారి ఫోన్‌ హ్యాక్‌ అవ్వడంపై సైబర్‌ క్రైమ్‌ నిపుణులు అవాక్కవుతున్నారు. ఓ అధికారి ఫోన్‌ను హ్యాక్‌ చేయడం అంత సులభం కాదని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. హ్యాకర్లు ఆ అధికారిపై వలపువలను విసిరి.. చాటింగ్‌ చేసి ఉంటారని, ఆ సమయంలో ‘స్టాగినోగ్రఫీ’ ద్వారా ఫోన్‌లో మాల్‌వేర్‌ను చొప్పించి, ఫోన్‌ను తమ కంట్రోల్‌లోకి తెచ్చుకుని ఉం టారని చెబుతున్నారు. ఆ అధికారి తన ఫోన్‌ను హ్యాకర్ల చేతికి ఇస్తే తప్ప..అందులో మాల్‌వేర్‌ను చొప్పించే అవకాశాలు లేవంటున్నారు. ఈ అంశంపై పోలీసు వర్గాలు నోరు మెదపడం లేదు. హ్యాకర్‌ను ఇప్పటికే గుర్తించారని తెలుస్తోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper