Homeజాతీయ వార్తలుTelangana BJP: 23 గెలిస్తే చాలట.. బీజేపీ టార్గెట్‌ అంతే!

Telangana BJP: 23 గెలిస్తే చాలట.. బీజేపీ టార్గెట్‌ అంతే!

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా హంగ్‌ తీసుకు రావాలని.. తాము కింగ్‌ మేకర్లం లేదా కింగ్‌ కావాలని బీజేపీ భావిస్తోంది. ఈమేరకు ఇప్పటికే కమలనాథులు డిసైడ్‌ అయ్యారు.

Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం దగ్గర పడుతోంది. దీంతో ప్రధాన పార్టీలు గెలిచే స్థానాలను లెక్కలు వేసుకుంటున్నాయి. అవి జారిపోకుండా ప్రచార జోరు పెంచేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో అధికార బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నువ్వా నేనా అన్నట్లు ఎన్నికల్లో తలపడుతుంటే.. బీజేపీ మాత్రం ఓ టార్గెట్‌ ఫిక్స్‌ చేసుకుంది. బీఆర్‌ఎస్‌ 80 నుంచి వంద సీట్లు వస్తాయని లెక్కలు వేసుకుంటోంది. బీజేపీ 70 నుంచి 80 సీట్లు వస్తాయంటోంది. మరి బీజేపీ లెక్క 23 మాత్రమే. ఈ సీట్లను మాత్రమే ఆ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. ఆ నియోజకవర్గాల్లో మాత్రమే పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తోంది.

హంగ్‌ లక్ష్యంగా..
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా హంగ్‌ తీసుకు రావాలని.. తాము కింగ్‌ మేకర్లం లేదా కింగ్‌ కావాలని బీజేపీ భావిస్తోంది. ఈమేరకు ఇప్పటికే కమలనాథులు డిసైడ్‌ అయ్యారు. అందుకే గతంలో బలంగా ఉన్నం రెండో స్థానంలో నిలిచిన, గత పార్లమెంట్‌ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన సీట్లపైనే ఎక్కువ దృష్టి పెడుతోంది. ఈ జాబితాలో మొత్తం 23 సీట్లు ఉన్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తర తెలంగాణలో ముస్లింలు ఎక్కువగా ఉండడంతో అక్కడ బీజేపీ బలపడే ప్రయత్నం చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదిలాబాద్, ముథోల్‌ వంటి చోట్ల రెండో స్థానంలో నిలిచింది. పార్లమెంట్‌ ఎన్నికల నాటికి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో దాదాపుగా పన్నెండు స్థానాల్లో బీఆర్‌ఎస్‌ కంటే ఎక్కువ మెజార్టీ సాధించింది. ఈ స్థానాలన్నింటిలోనూ బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది.

గ్రేటర్‌లో గెలుపుపై ధీమా..
గ్రేటర్‌ పరిధిలో కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. అక్కడ పలు నియోజకవర్గాల్లో బీజేపీ పరిస్థితి అంచనా వేసుకుని కొన్ని నియోజకవర్గాలపై గురి పెట్టింది. మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి వంటి చోట్ల విజయానికి తగ్గరగా వచ్చి ఆగిపోతుంది. ఇలాంటి నియోజకవర్గాలన్నీ ఎంపిక చేసుకుని బలమైన అభ్యర్థులు ఉన్నారనుకున్న చోట్ల గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
మిగతా చోట్ల విఫల యత్నం ఎందుకనీ..
బలం తక్కువగా ఉన్న చోట, కొత్తగా పుంజుకోవడం అంత ఈజీ కాదని బీజేపీ భావిస్తోంది. అందుకే తమకు పట్టు, బలం ఉన్న చోట నెగ్గాలని భావిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగానే బీజేపీ 23 స్థానాలను ఎంపిక చేసుకుంది. వాటిపైనే దృష్టి కేంద్రీకరిస్తోంది. ప్రధాని, కేంద్ర మంత్రుల పర్యటనలు కూడా ఆ 23 నియోజవర్గాలు కవర్‌ చేసేలా చూస్తోంది. మొత్తంగా బీజేపీ వ్యూహం పూర్తిగా హంగ్‌ లక్ష్యంతోనే సాగుతోందని అర్థమవుతోంది.

Recommended Video:

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper