spot_img
Homeఆంధ్రప్రదేశ్‌India Alliance: ఇండియా కూటమిలోకి టిడిపి, జనసేన

India Alliance: ఇండియా కూటమిలోకి టిడిపి, జనసేన

India Alliance: ఇండియా కూటమిలోకి మరో రెండు పార్టీలు చేరనున్నాయా? చంద్రబాబు అరెస్టుతో టిడిపి, ఎన్డీఏ తో కటీఫ్ చెప్పడం ద్వారా జనసేన ఇండియా కూటమిలోకి చేరుతాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. బిజెపికి వ్యతిరేకంగా.. ప్రాంతీయ పార్టీలతో ఇండియా కూటమి బలంగా కనిపిస్తోంది. అయితే దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమిని నడిపిస్తున్న బిజెపి బలంగా ఉంది. ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ బలహీనంగా ఉంది. కానీ ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీల కంటే.. ఇండియా కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. తాజాగా టిడిపి, జనసేన చేరితే ఇండియా కూటమి బలం పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినట్లు పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏకు దగ్గర కావాలనుకున్నా బిజెపి ఆసక్తి చూపలేదు. ఇప్పుడు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సైతం ఎన్డీఏలో చేరేందుకు మొగ్గు చూపడం లేదు. అటు చంద్రబాబును ఇండియా కూటమిలోకి తీసుకెళ్లాలని వామపక్షాలు భావిస్తున్నాయి. సిపిఐ నేత నారాయణ నేరుగా చంద్రబాబు కి ఈ విషయం చెప్పుకొచ్చారు. అయితే గత ఎన్నికల్లో జరిగిన పరిణామాల క్రమంలో చంద్రబాబు వెనక్కి తగ్గారు. ఇప్పుడు పవన్ టిడిపి తో పొత్తు ప్రకటన, అటు ఎన్డీఏ కి గుడ్ బై చెప్పడం వంటి కారణాలతో నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఎదురయ్యింది.

ఏపీలో బిజెపి కంటే వామపక్షాలే శ్రేయస్కరమని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. తాజాగా వెల్లడైన ఒక సర్వేలో టిడిపి, జనసేన కూటమితో వామపక్షాలు కలిస్తే అద్భుత విజయం దక్కుతుందని తేలింది. అదే బిజెపితో అయితే వైసీపీకి అనుకూల ఫలితం వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే తేల్చింది. దీంతో టిడిపి, జనసేన పునరాలోచనలో పడ్డాయి. వామపక్షాల వైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే వామపక్షాలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ఇండియా కూటమి వైపు టిడిపి, జనసేన వెళ్లాల్సి ఉంటుంది.

గత ఎన్నికల్లో జనసేన వామపక్షాలతో కలిసి పని చేసింది. పవన్ భావజాలానికి, వామపక్ష భావజాలానికి దగ్గర సంబంధాలు ఉన్నాయి. అటు తెలుగుదేశం పార్టీ సైతం పలు సందర్భాల్లో వామపక్షాలతో కలిసి పని చేసింది. మంచి విజయాలను దక్కించుకుంది. అందుకే మూడు పార్టీల కలయిక చాలా సులువు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికైతే చాలా సంవత్సరాల తర్వాత వామపక్షాలు ప్రధాన రాజకీయ పక్షాల స్నేహాన్ని అందుకోనున్నాయి. ఆ రెండు పార్టీలను జాతీయస్థాయిలో ఇండియా కూటమి వైపు తీసుకెళ్ళనున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Varanasi Movie

Varanasi Movie: వారణాసి అన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందా…

Varanasi Movie: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతుందనే...
Tammineni Family

Tammineni Family: ఒడిస్సాలో చిక్కిన తమ్మినేని ఫ్యామిలీ?!

Tammineni Family: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో నాలుగు కోట్ల భూమిని అక్రమంగా కొల్లగొట్టారు అని...
YSRCP

YSRCP: వైసీపీకి ఆ జిల్లాలో భారీ డ్యామేజ్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఆ పార్టీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అరెస్టుల పర్వం నడుస్తోంది. ఇప్పటివరకు పాత కేసుల్లో నేతలు అరెస్ట్ అవుతూ వచ్చారు. కానీ ఇప్పుడు...
Operation Prahaar

Operation Prahaar: ఆపరేషన్ ‘ప్రహార్’.. ఉగ్రవాద అంతంపై మోడీ-షా ల అద్భుత వ్యూహమిదీ

Operation Prahaar: భారతదేశంలో ఉగ్రవాదం ఎప్పుడూ కొత్త సవాలు కాదు. కశ్మీర్‌లో దశాబ్దాలుగా సరిహద్దు ఆవలి నుంచి ప్రోత్సాహం పొందుతున్న ఉగ్రవాదం, పంజాబ్‌లో ఖలిస్తానీ కార్యకలాపాలు, దండకారణ్యంలో నక్సలిజం ఇవన్నీ దేశ భద్రతకు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారా…ఈ సినిమాలో అసలు...

Chennai Love Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఇలాంటి...
Oktelugu Epaper