Gold And Silver Rates: బంగారం ధరలు మరింత తగ్గాయి. గురువారం తో పోలిస్తే శుక్రవారం మరో రూ.190 మేర తగ్గింది. రోజురోజుకు బంగారం ధరలు తగ్గుతుంటే వినియోగదారులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే కొన్ని నగరాల్లో వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. మరికొన్ని నగరాల్లో మాత్రం గురువారంతో పోలిస్తే స్థిరంగా ఉన్నాయి. అక్టోబర్ 6న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బులియన్ మార్కెట్ ప్రకారం అక్టోబర్ 6న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.52,400గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములను రూ.57,160 కి దిగింది. అక్టోబర్ 5న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.52,590తో విక్రయించారు. గురువారం కంటే శుక్రవారం రూ.190 మేర తగ్గింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఇక్కడ రూ.52,550 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.57,310గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.52,400 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.57,160 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.52,950 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.57,750తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.52,400 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.57,160తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,400తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.57,160తో విక్రయిస్తున్నారు.
అయితే వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం దాదాపు రూ.700 మేర పెరిగి ప్రస్తుతం కిలో వెండి రూ.71,100తో విక్రయిస్తున్నారు. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.71,100గా నమోదైంది. చెన్నైలో రూ.73,500, బెంగుళూరులో 69,000, హైదరాబాద్ లో రూ.73,500తో విక్రయిస్తున్నారు. ఢిల్లీ, చెన్నైలో వెండి ధరలు పెరిగాయి. బెంగుళూరులో మాత్రం స్థిరంగా ఉన్నాయి.