
Atiq Ahmed Properties: కళ్ళు ఉన్నవాడు ముందు చూస్తాడు. దిమాక్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడు. అలాంటి దిమాక్ ఉంది కనుక యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో స్వచ్ఛభారత్ చేపడుతున్నాడు..అది అలాంటి ఇలాంటి స్వచ్ఛభారత్ కాదు.. మాఫియాను ఏరేసే స్వచ్ఛభారత్, అరాచక శక్తుల ఆట కట్టించే స్వచ్ఛభారత్. వికాస్ దూబే, అతీక్ అహ్మద్…ఇలా పెద్ద పెద్ద తలకాయలు ఎగిరిపోయాయి..ఇప్పుడు యోగి అసలు టార్గెట్ యూపీ నమూనాను మార్చడం.. మాఫియా గ్యాంగ్ ఆస్తులు స్వాధీనం చేసుకోవడం..
యూపీ లో పేరు మోసిన గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ హతమయ్యాడు.. అతని కొడుకు అంతకుముందు జరిగిన ఎన్ కౌంటర్ లో చచ్చాడు. ఇప్పుడు దేశం మొత్తం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ని ఆకాశానికి ఎత్తేస్తోంది. కాబోయే ప్రధానమంత్రి అంటూ కీర్తిస్తోంది..సరే ఇదంతా ఇప్పటిదాకా చూసిన కోణం..ఇప్పుడు ఎవరికి తెలియని కోణాన్ని యోగి చూపించబోతున్నాడు.. అరాచకవాదులు అడ్డగోలుగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు పెద్ద స్కెచ్చే వేశాడు. ఇందుకు రంగంలోకి ఈడీని ఎప్పుడో దించేశాడు. అంతేకాదు రాష్ట్ర దర్యాప్తు సంస్థలను కూడా వాడుకోబోతున్నాడు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ సిఐడి విభాగం అక్రమార్కుల ఆస్తులను లెక్క కట్టే పనిలో పడింది.
అతీక్ అహ్మద్ నేర సామ్రాజ్యంలో 140 మంది దాకా ఉన్నారు. అధికారికంగా 1400 కోట్లు అతీక్ అహ్మద్ కూడబెట్టాడు అని అంటారు. కానీ బినామీల రూపంలో అతీక్ అహ్మద్ కు 11,600 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అయితే వీటిని ఎలా స్వాధీనం చేసుకోవాలనే దానిపైనే యోగి ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అతీక్ అహ్మద్ పై ఈడి సోదాలు మొదలుపెట్టింది. విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకుంది. యోగి ప్రభుత్వం కూడా అతీక్ అహ్మద్ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన ఇళ్లను ధ్వంసం చేసింది.. ఆ ప్రభుత్వ స్థలంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇళ్ళు నిర్మిస్తోంది. త్వరలో వీటిని పేదలకు పంచేందుకు యోగి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం అతీక్ అహ్మద్ హత్యకు గురైన నేపథ్యంలో అతడి ఆస్తులు స్వాధీనం చేసుకోవడంలో యోగి ప్రభుత్వానికి పెద్దగా ఇబ్బంది లేదు. మరోవైపు అతీక్ అహ్మద్ హత్య తర్వాత ఒక సెక్షన్ వర్గం యోగి ఆదిత్యనాథ్ మీద విరుచుకుపడుతోంది. మానవ హక్కుల సంఘం ఈ హత్యలను ఖండిస్తోంది.. వీటిని యోగి ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

ఉత్తరప్రదేశ్లో ఇప్పట్లో అఖిలేష్ యాదవ్ అధికారంలోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. పైగా సమాజ్వాది పార్టీ ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు అతీక్ అహ్మద్ ను పెంచి పోషించింది. అతడు ఏకంగా ములాయం సింగ్ యాదవ్ కు తన కుక్కతో షేక్ హ్యాండ్ ఇప్పించిన ఘనుడు. దీంతో అతను చెప్పినట్టల్లా సమాజ్ వాది పార్టీ ఆడేది. అయితే యోగి అధికారం లోకి రావడంతో ఒక్కసారిగా గ్యాంగ్ ఆగడాలకు చెక్ పడింది. అయితే అతీక్ మొత్తం బినామీల చేతిలో ఉండటంతో ఇప్పుడు వాటిని ఎలా స్వాధీనం చేసుకుంటారనేదే ప్రశ్నలకు గా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎవరి పేరుతో ఆస్తులు ఉన్నాయో వాళ్లు ఎన్నటికీ బయటికి చెప్పరు.. ఒకవేళ సమాజ్ వాది పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ బెదిరించేందుకు ప్రయత్నిస్తే వారు బెదిరిపోవడానికి సిద్ధంగా లేరు. సో అతీక్ అహ్మద్ బినామీలు సంతోషంగా ఉంటారు. బినామిలంతా ఆస్తులు అనుభవిస్తూ ఉంటారు. వేరే వారికి అమ్మేసి క్యాష్ చేసుకుంటారు.. ఆస్తుల విషయంలో గొడవలు జరిగితే యోగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. వాటిని పేదలకు పంచే ప్లాన్లో ఉంది..