
Samantha: సౌత్ ఇండియా లోనే టాప్ మోస్ట్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత , అక్కినేని నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియా లో ఆమె పై ఎల్లప్పుడూ ఎదో విధంగా విమర్శలు వస్తూ ఉన్న సంగతి తెలిసిందే. సాధారణంగానే ఆమెకి స్పందించే అలవాటు ఎక్కువ కాబట్టి ట్రోల్ల్స్ కి కూడా ఆమె స్పందిస్తూ ఉంటుంది,ఒకానొక్క దశలో సోషల్ మీడియా లో తనపై జరుగుతున్న ట్రోలింగ్స్ పై కేసు కూడా వేసిన సందర్భం ఉంది.
అయితే విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య ఈమెపై ఇప్పటికీ గౌరవం ఉన్నట్టే వ్యవహరిస్తున్నాడు కానీ, సమంత మాత్రం నాగ చైతన్య పై పీకల దాకా కోపం పెంచేసుకుంది. అయితే నాగ చైతన్య తో ప్రస్తుతం ఆమె ఎలా ఉన్నా, అక్కినేని అఖిల్ తో మాత్రం క్లోజ్ గానే ఉంది.రీసెంట్ గా ఆయన పుట్టిన రోజుకి శుభాకాంక్షలు కూడా తెలియచేసింది.
అయితే సమంత రీసెంట్ గా బాలీవుడ్ కి చెందిన ఒక మీడియా తో అక్కినేని ఫ్యామిలీ టాలీవుడ్ లోనే వరస్ట్ కుటుంబాలలో ఒకటి అని, ఆ ఫ్యామిలీ తో గతం లో రిలేషన్ పెట్టుకున్నందుకు ఇప్పుడు సిగ్గు పడుతున్నాను అని చెప్పిందని ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సందు నిన్న ట్విట్టర్ లో ఒక ట్వీట్ వేసాడు. ఈమధ్య ఈయన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న సెలెబ్రిటీలపై సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ, వాళ్లపై లేనిపోని గాసిప్స్ పుట్టిస్తూ కాలం గడిపేస్తున్న సంగతి తెలిసిందే.

అందులో భాగంగానే సమంత పై ఇలాంటి పుకారు పుట్టించాడని సమంత అభిమానులు చెప్తున్నారు. సమంత నాగ చైతన్య తో విడిపోయినప్పటికీ, ఏనాడూ కూడా అక్కినేని కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగే విధమైన కామెంట్స్ చెయ్యలేదని, అలాంటి వ్యక్తి మీద ఇలాంటి పుకార్లు పుట్టించడానికి మనసు ఎలా వచ్చిందంటూ ఉమర్ సందు ని ఒక రేంజ్ లో తిడుతున్నారు సమంత ఫ్యాన్స్.
As per #SamanthaRuthPrabhu , #Akkineni Family is the “ Worst ” in Tollywood. They are all Psychopaths & Narrow minded people.
— Umair Sandhu (@UmairSandu) April 18, 2023