Begging Experiment: చెమట చుక్క చిందించలేదు. శరీరాన్ని వంచలేదు. అలాగని కంప్యూటర్ ముందు కుస్తీ పడలేదు. లాప్టాప్ ఎదుట కరకరకాల యవ్వారాలు చేయలేదు. మాయ మాటలు చెప్పలేదు. ఎదుటివారిని మోసం చేయలేదు. జస్ట్ అలా కూర్చున్నాడు. అంతే.. డబ్బు అలా వచ్చి అతడి చేతిలో వాలిపోయింది. దీని వెనక మాయలేదు. మంత్రం అంతకంటే లేదు.
నేటి కాలంలో యూట్యూబర్లు రకరకాల పనులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి చిత్రవిచిత్రమైన వ్యవహారాలకు పాల్పడుతున్నారు. అవి జనాలకు కాస్త వింతగా ఉండడంతో ఆదరిస్తున్నారు. జనాల ఆదరణతో యూట్యూబర్లు మరింత తమ పాపులారిటీ పెంచుకుంటున్నారు. నాలుగు రాళ్ళను వెనకేసుకుంటున్నారు. ఈ యూట్యూబర్ కూడా అలానే చేశాడు. ఈ పని ద్వారా ఆ యూట్యూబర్ బోలెడంత పాపులారిటీ సంపాదించాడు. సోషల్ మీడియాలో తన గురించి మాత్రమే చర్చ జరిగే విధంగా చూసుకున్నాడు. అలాగని అతడు నేల విడిచి సాము చేయలేదు. రకరకాల జిమ్మిక్కులు ప్రదర్శించలేదు.
అతని పేరు పురుషోత్తం.. ఫేమస్ యూట్యూబర్.. కొత్తగా ఏదైనా చేయాలి అనుకున్నాడు. ఈ క్రమంలో అతడు హరిద్వార్ వెళ్ళాడు. అతడు తన స్నేహితుడు సచిన్ ను బిచ్చగాడిగా మార్చాడు. అతని మెడకు ఒక స్కానర్ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత భిక్షాటన చేయించాడు. కొందరు అతడిని ఏమాత్రం పట్టించుకోలేదు. మరికొందరు అతడి స్థితి చూసి డబ్బులు వేశారు. కొందరు స్కాన్ చేశారు. ఇలా 8 గంటల్లో నాలుగు వేల వరకు వచ్చాయి. ఈ ప్రకారం చేసుకుంటే నెలకు 1.2 లక్షల సంపాదించవచ్చని.. యూట్యూబర్ పురుషోత్తం పేర్కొన్నాడు. నెలకు 1.2 లక్షలు అంటే.. ఒక ఐటీ ఉద్యోగి వేతనంతో సమానమని పురుషోత్తం వ్యాఖ్యానించాడు.
బిక్షాటన చేయడాన్ని ఒక ఆదాయం మార్గం లాగా చూడకూడదని పురుషోత్తం చెబుతున్నాడు. “హరిద్వార్ దేవ భూమి లాంటిది. ఇక్కడ ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈ ప్రాంతం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. కొత్తగా ఏదైనా చేయాలి అనిపించింది. అయితే ఇది చాలామందికి నచ్చకపోవచ్చు. కాకపోతే జనాలకు ఆసక్తికరంగా ఉండాలని నా స్నేహితుడిని బిచ్చగాడిగా మార్చాను. మెడలో స్కానర్ వేయించాను. అతడు అలా కూర్చోవడంతో దాదాపు 4వేల వరకు వచ్చాయి. 8 గంటల పాటు అతడు ఇలా కూర్చున్నాడు. ఈ లెక్కన చూసుకుంటే నెలకు 1, 20,000 వరకు సంపాదించవచ్చు. కాకపోతే దీనిని ఆదాయ మార్గంగా చూడకూడదని” పురుషోత్తం పేర్కొన్నాడు.
View this post on Instagram