Fake Documents Scam: 3000 కు ఆధార్ కార్డు.. ఐదువేలకు పాన్ కార్డు.. పదివేలకు బర్త్ సర్టిఫికెట్.. 25 వేలకు ఇంకా అనేక రకాల ధ్రువపత్రాలు.. బెంగాల్ ఎన్నికలు ముగిసిన తర్వాత.. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుపుతున్న తనిఖీలలో వెలుగులోకి వస్తున్న వాస్తవాలు ఇవి. ఈ గడ్డమీద పుట్టకపోయినప్పటికీ.. ఈ గడ్డతో ఎటువంటి బంధం లేకపోయినప్పటికీ.. సరిహద్దుల నుంచి వచ్చేసి.. ఈ దేశ పౌరసత్వాన్ని దర్జాగా అనుభవించారు. ప్రభుత్వ పథకాలను సక్రమంగా వాడుకున్నారు.
కమలం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మురికిగుంట మొత్తం బయటపడుతోంది. ఓట్ల కోసం ఒక వర్గానికి మమత చేసిన ఆయాచిత లబ్ధి వెలుగులోకి వస్తోంది. అయితే ఇది కేవలం బెంగాల్ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో పాతబస్తీలో అక్రమంగా ఉంటున్న ఏడుగురు బంగ్లాదేశ్ ప్రజలను పోలీసులు గుర్తించారు. వారి వద్ద ఉన్న ఫేక్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వారిని బంగ్లాదేశ్ కు పంపించారు. కేవలం తెలంగాణ, బెంగాల్ రాష్ట్రాలకే ఈ వ్యవహారం పరిమితం కాలేదు. కేంద్రం నిఘా పెడితే.. గట్టిగా దృష్టి సారిస్తే దిమ్మతిరిగే వాస్తవాలు తెలుస్తున్నాయి.
ఇటీవల ది హిందూస్తాన్ టైమ్స్ ఒక ప్రత్యేకమైన కథనాన్ని పబ్లిష్ చేసింది. అందులో దేశవ్యాప్తంగా 150 పాఠశాలలు మూతపడుతున్నాయని పేర్కొంది. దీని వెనక ఒక బలమైన కారణం ఉందని స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అనేది మరుగున పడుతున్న నేపథ్యంలో.. ది హిందూస్తాన్ టైమ్స్ ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది.
150 పాఠశాలలు మూతపడడానికి ప్రధాన కారణం.. ఈ దేశభద్రత ప్రమాదంలో ఉండడమే.. ఆ 150 పాఠశాలల ద్వారా ఇప్పటివరకు దాదాపు 19 వేలకు పైగా ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చారట. వాటి ద్వారా ఆధార్ కార్డులు.. ఇతర ధ్రువపత్రాలు పొందారట. ఇటీవల కాలంలో కేంద్ర సంస్థలు దృష్టి సారించడంతో ఈ పాఠశాలల బాగోతం బయటపడింది. దీంతో ఆ పాఠశాలలను మూసి వేయడం మాత్రమే కాకుండా.. అవి జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రాలను కేంద్రం రద్దు చేసింది.
దీనిపై కొంతమంది ఉదారవాదులు మండిపడుతున్నారు. ఆ స్థాయిలో పాఠశాలలను ఎందుకు మూసివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ దీని వెనుక ఉన్న అసలు నిజం ఇది. ఒక వర్గానికి మేలు చేయడానికి.. ఒక వర్గానికి లబ్ధి చేకూర్చడానికి కొంతమంది కూడబలుక్కుని చేస్తున్న దారుణమిది. దీనివల్ల ఈ దేశ ప్రయోజనాలు నాశనం అవుతున్నాయి. ఈ దేశంలోకి దుర్మార్గులు చొరబడుతున్నారు. ఈ దేశాన్ని నాశనం చేయడానికి కొంతమంది శక్తులతో కలిసి పనిచేస్తున్నారు. ఇప్పటికే ఆలస్యమైంది. ఆయనప్పటికీ భారత ఇంటెలిజెన్స్ వర్గాలు మేల్కొనడం.. మన దేశానికి మంచిదయింది. ఇన్ని సంవత్సరాలపాటు ఈ పాఠశాలలు ఎంతమందికి ఇలా జనన ధ్రువీకరణ పత్రాలు ఇచ్చాయి.. ఎంతమందికి ఈ దేశంలో పంది కొక్కుల మాదిరిగా ప్రవేశించే అవకాశాన్ని కల్పించాయో ఇప్పుడు తేలాల్సి ఉంది.
