Homeఎంటర్టైన్మెంట్Telugu Film Industry: ఇద్దరు హీరోలతో ఫ్రెండ్షిప్ చేసి తన కెరియర్ ను కోల్పోయిన స్టార్...

Telugu Film Industry: ఇద్దరు హీరోలతో ఫ్రెండ్షిప్ చేసి తన కెరియర్ ను కోల్పోయిన స్టార్ హీరో…

Telugu Film Industry: సినిమా ఇండస్ట్రీలో హీరోల కెరియర్ ఎన్ని సంవత్సరాల పాటు సాగుతుందనేది ఎవ్వరు చెప్పలేరు. వరుసగా సక్సెస్ లను సాధిస్తే టాప్ పొజిషన్ కి వెళ్తారు. వరుసగా మూటగట్టుకుంటే మాత్రం పాతాళానికి పడిపోయే ప్రమాదం ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే సినిమా సెలక్షన్ల విషయంలో వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అందులో ఏమాత్రం తేడా జరిగిన కూడా భారీ విమర్శలను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. అలాగే తమ కెరియర్లను కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురవచ్చు. ఇప్పటివరకు ఇండస్ట్రీకి వచ్చి మొదట మూడు నాలుగు సినిమాలతో సక్సెస్ లను సాధించి ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి హీరోల్లో తరుణ్ ఒకరు కెరియర్ స్టార్టింగ్ లో జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలకు పోటీని ఇస్తూనే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ని తెచ్చుకున్నాడు.

తను చేసిన సినిమాలు కూడా ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అవ్వడం. ముఖ్యంగా అమ్మాయిల్లో అతనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం కూడా తనకు చాలా వరకు ప్లస్ అయింది. కానీ అనుకోని కారణాలవల్ల తరుణ్ చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. తన స్టోరీ సెలక్షన్స్ సరిగ్గా లేకపోవడం, పర్సనల్ విషయాల్లో ఇబ్బందులను ఎదుర్కోవడం, కాంట్రవర్సీ ల్లో ఇరుక్కోవడం లాంటివి చేయడంతో ఆయన క్రేజ్ ఒక్కసారిగా పడిపోయింది.

దాంతో అతనికి అవకాశాలు కూడా కరువైపోయాయి. ఇక తనతోపాటు కెరియర్ స్టార్టింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు లాంటి నటులు ఇప్పుడు టాప్ హీరోలుగా కొనసాగుతుంటే ఆయన మాత్రం సినిమాలు లేక ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోయాడు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేయాలనే ప్రయత్నం చేసిన కూడా అది వర్కౌట్ కావడం లేదు.

నిజానికి తరుణ్ లాంటి లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నటుడి కెరీర్ అనేది ఇలా పడిపోవడం పట్ల చాలామంది చాలా రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో ఎదగడం చాలా కష్టం. ఎదిగిన తర్వాత దాన్ని కాపాడుకోవడం మరింత కష్టంతో కూడుకున్న పని…ఇక ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది పెద్దలు ఇప్పటికి ఆ మాటలు చెబుతూనే ఉంటారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper