Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీSundar Pichai: కోపం google మీద కాదు.. సుందర్ పిచాయ్ కి జరిగిన ఘోర అవమానం...

Sundar Pichai: కోపం google మీద కాదు.. సుందర్ పిచాయ్ కి జరిగిన ఘోర అవమానం వెనుక.. పెద్ద కుట్రే..

Sundar Pichai: అప్పట్లో ఇజ్రాయిల్ పాలస్తీనా మీద యుద్ధం చేస్తున్నప్పుడు.. మనదేశంలో కూడా పాలస్తీనాకు అనుకూలంగా ప్రదర్శనలు జరిగాయి. సేవ్ పాలస్తీనా అంటూ చాలామంది నినాదాలు చేశారు. తమిళనాడులో అయితే ఇంకా ఎక్కువగా నిరసనలు జరిగాయి. అక్కడి ప్రభుత్వ పెద్దలు కూడా పాలస్తీనాకు అనుకూలంగా మాట్లాడటం మొదలుపెట్టారు. కొంతమంది అయితే ఏకంగా యుద్ధాన్ని ఆపడంలో భారత్ తనవంతు పాత్ర పోషించాలని.. అవసరమైతే ఇజ్రాయిల్ మీద దాడులు చేయాలని డిమాండ్ చేశారు.

నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ దేశానికి అనుకూలంగా ఉండడం.. ఇజ్రాయిల్ మనతో సౌఖ్యంగా ఉండడం కొంతమంది ఎర్రిగాళ్లకు నచ్చలేదు. పైగా పాలస్తీనా అంటే వాళ్లకు విపరీతమైన ఇష్టం. దీనికి తోడు అప్పట్లో ప్రియాంక గాంధీ పాలస్తీనా దేశానికి అనుకూలంగా వ్యాఖ్యలు రాసిన ఒక బ్యాగు కూడా ధరించి పార్లమెంటుకు హాజరయ్యారు. వాస్తవానికి ఇజ్రాయిల్.. పాలస్తీనా మీద దాడులు చేస్తే ఇండియాకు ఏంటి సంబంధమో ఇప్పటికీ అర్థం కాని విషయం.

ఇటీవల స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ ఆయన మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడానికి హాజరయ్యారు. కానీ పాలస్తీనా అనుకూల బ్యాచ్ ఆయన ప్రసంగాన్ని బైకాట్ చేసింది. ఇప్పుడే కాదు ఇటీవల కాలంలో అనేక సందర్భాలలో అక్కడి విద్యార్థులు ఇలా బాయ్ కాట్ చేశారు..

ఇలా బాయ్ కాట్ చేసే బదులు పాలస్తీనా అనుకూల బ్యాచ్.. గూగుల్ ఉత్పత్తులైన యూట్యూబ్.. జిమెయిల్.. గూగుల్ ట్రాన్స్లేట్.. ఆండ్రాయిడ్ వంటి వాటిని బాయికాట్ చేస్తే బాగుంటుంది. సుందర్ పిచాయ్ గూగుల్ సంస్థలో ఉద్యోగి మాత్రమే. గూగుల్ సంస్థకు అధిపతి కాదు. మరోవైపు google సంస్థ ఇజ్రాయిల్ దేశంతో పదివేల కోట్ల క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని కొన్ని సంవత్సరాల క్రితం కుదుర్చుకుంది. అది పాలస్తీనా దేశానికి కడుపు మంట. దీనికి తోడు సుందర్ భారతీయుడు. ప్రస్తుత భారత ప్రధాని ఇజ్రాయిల్ దేశానికి అనుకూలంగా ఉన్నాడు. ఇజ్రాయిల్ దేశంతో అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. అందువల్లే కొంతమంది పాలస్తీనా వాళ్లు పకడ్బందీ ప్రణాళికతో సుందర్ మీద ఇలా దాడికి దిగారు. అన్నట్టు పాలస్తీనా దేశానికి తమిళనాడు ప్రజలు సంఘీభావం తెలిపారు. ఇజ్రాయిల్ దాడుల పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఒక భారతీయుడు.. అందులో ఒక తమిళ రాష్ట్రానికి చెందినవాడు.. సుందర్ మీద ఇలాంటి దాడి చేయడం నిజంగా అత్యంత ఘోరం.. అత్యంత హీనం.. దీని వెనక ఇంతటి కుట్ర ఉందని వెస్ట్రన్ మీడియా ఒక సంచలన కథనాన్ని ప్రసారం చేయడంతో.. దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు అనేది తేలిపోయింది. ఇదంతా కూడా భారతదేశానికి వ్యతిరేకంగా సాగిస్తున్న కుట్ర అని తేలింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper