spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Roja vs Pawan Kalyan : రేణుదేశాయ్-పవన్ లను తిట్టి తప్పు చేశా.. ఆ బాధ...

Roja vs Pawan Kalyan : రేణుదేశాయ్-పవన్ లను తిట్టి తప్పు చేశా.. ఆ బాధ ఏంటో నాకిప్పుడు అర్థమైందన్న రోజా

Roja vs Pawan Kalyan : ఇటీవల మంత్రి రోజా వివాదాల్లో చిక్కుకున్నారు. దేశవ్యాప్తంగా చర్చకు కారణమయ్యారు. టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాల నేపథ్యంలో మంత్రి రోజా వ్యవహార శైలి టిడిపి శ్రేణులకు మనస్థాపం కలిగించింది. ఈ తరుణంలోనే బండారు సత్యనారాయణమూర్తి రోజాను టార్గెట్ చేసుకున్నారు. వ్యక్తిగత కామెంట్స్ కు దిగారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కానీ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించి బెయిల్ పొందగలిగారు. అటు తరువాత సైతం ఈ వివాదం కొనసాగుతూ వచ్చింది.

తాజాగా మంత్రి రోజాకు మద్దతుగా ఎంపీ నవనీత్ కౌర్ స్పందించారు. నవనీత్ కౌర్ స్టార్ హీరోయిన్. తన సహచర నటి రోజా పై వ్యక్తిగత కామెంట్లను ఖండించారు. ముందుగా కోలీవుడ్ నటి కుష్బూ ఈ వివాదం పై స్పందించారు. అటు తర్వాత రాధికా శరత్ కుమార్, రమ్యకృష్ణ, మీనా తదితరులు స్పందించి.. ప్రత్యేక వీడియోలు సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే అంతకుమించి సినీ ప్రముఖులు ఎవరూ స్పందించకపోవడం విశేషం.

చివరకు వైసీపీ మహిళా నేతలు ఎవరు ఈ వ్యాఖ్యలను ఖండించకపోవడం రోజాకు తీవ్ర మనస్తాపం తెచ్చిపెట్టింది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాత్రమే స్పందించి.. నేరుగా రాష్ట్ర డిజిపి కి లేఖ రాశారు. దీంతో బండారు సత్యనారాయణమూర్తి పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే ఒక్క వాసిరెడ్డి పద్మ తప్పించి వైసీపీ మహిళా మంత్రులు కానీ.. మహిళా నేతలు కానీ.. కీలక నాయకులు కానీ.. ఎవ్వరూ స్పందించలేదు. దీంతో రోజా మనస్థాపానికి గురైనట్లు సమాచారం. బండారు వ్యాఖ్యలు కంటే సొంత పార్టీ నేతలు స్పందించకపోవడం పైనే రోజా ఎక్కువగా బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

అయితే గతంలో రోజా సైతం చాలామందిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్నారు. వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆమె బాధితుడే. పవన్ విధానపరమైన, రాజకీయపరమైన విమర్శలు చేసిన ప్రతిసారి రోజా టార్గెట్ చేస్తూ వచ్చారు. ఒకానొక దశలో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ వైవాహిక జీవితం పై కూడా మాట్లాడారు. తన స్థాయికి మించి విమర్శలు చేశారు. ఇప్పుడు వాటిని గుర్తు చేసుకుంటూ తప్పు అని తెలుసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన వరకు వస్తే కానీ ఏది తెలియదని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికైతే మంత్రి రోజా లో రియలైజ్ కనిపిస్తుందట. మరి అది ఎంతవరకు వాస్తవమో చూడాలి.

 

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...
Today 25 July 2026 Horoscope:

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Oktelugu Epaper