Homeఎంటర్టైన్మెంట్Tollywood Heroines: ఈ స్టార్ హీరోయిన్లకు ఆ స్టార్ హీరోలు అంటే ఇష్టమా..?

Tollywood Heroines: ఈ స్టార్ హీరోయిన్లకు ఆ స్టార్ హీరోలు అంటే ఇష్టమా..?

Tollywood Heroines: కామన్ పీపుల్ కు హీరో, హీరోయిన్లు అంటే ఇష్టం. ఫేవరెట్ స్టార్లుంటారు. కానీ అందరికీ కాదు. అయితే కామన్ పీపుల్ కు ఫేవరెట్ ఉండడం కామన్. కానీ హీరోయిన్లకు, హీరోలకు కూడా కో స్టార్లు అంటే ఇష్టం ఉంటుంది. వాళ్లు కూడా స్టార్లే అవడం విశేషం. అయితే హీరోయిన్లు కూడా ఇతర హీరోలపై అభిమానాన్ని పెంచుకుంటారు. చాలా సార్లు తనతో నటించిన హీరోలనే ఫేవరెట్ అని చెబుతుంటారు. అంటే.. ఏ హీరోతో నటిస్తుంటే ఆ హీరోను ఫేవరెట్ అని హీరయిన్లు చెప్పడం మనం గతంలో చాలా సార్లు చూశాం. కానీ కొన్ని సార్లు వారి మనసుకు నచ్చిన అభిమాన హీరో ఎవరో కూడా తెలుపుతుంటారు. మరీ మన స్టార్ హీరోయిన్ లు అభిమానించే ఆ స్టార్ హీరోలు ఎవరో ఒకసారి చూసేద్దామా…

శ్రీలీల..ఈ నటికి నచ్చిన హీరో బాలకృష్ణ. వీరిద్దరు కలిసి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే నందమూరి బాలకృష్న అంటే శ్రీలీలకు చచ్చేంత ఇష్టమట. తాను మొదటి నుంచి బాలయ్యకు వీరాభిమానిని అని తెలిపింది. ఇప్పుడు ఆయనతోనే సినిమా చేయడం సంతోషంగా ఉందని తెలిపింది. ఆయనను దగ్గర ఉండి గమనించడం, ఆయన వ్యక్తిత్వం చూసి మరింత అభిమానం పెరిగింది అని తెలిపింది. టాలీవుడ్ లో లేటెస్ట్ సెన్సేషన్ గా పేరు సంపాదించిన శ్రీలీల ఎలాంటి అవకాశాలను అందుకుంటూ దూసుకొని పోతుందో తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి కొద్ది సమయంలోనే స్టార్ సెలబ్రిటీల జాబితాలో చేరిపోయింది. ఇప్పటికీ ఈ అమ్మడు చేసింది రెండు సినిమాలే అయినా.. ప్రస్తుతం అకౌంట్లో మాత్రం పది సినిమాలను రెడీగా పెట్టుకుంది. ఆమె ఖాతాలో బాలయ్య, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి బడా హీరోలు ఉండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

సాయి పల్లవి.. సాయి పల్లవికి ఏ హీరో అంటే ఇష్టమని ఒక ఇంటర్వ్యూలో అడిగితే.. ముగ్గురు హీరోల గురించి తెలిపింది. అందులో ముందు వరసలో కమల్ హాసన్ ఉన్నారు. ఇక సూర్య, ముమ్మట్టి అంటే కూడా అభిమానం అని తెలిపింది సాయి పల్లవి. వీరిలో కమల్ హాసన్ అంటే మరీ ఇష్టమట. తన సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ను కూడా దాచుకున్నానని తెలిపింది. ఇప్పటికీ ఆ పోస్టర్లు తన దగ్గరే ఉన్నాయని చెప్పింది సాయి పల్లవి. ఇక కమల్ హాసన్ సొంత బ్యానర్ లో గార్గీ సినిమా వచ్చింది. ఈ సినిమాలో సాయి పల్లవి నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.

సమంత.. ఎన్నో హిట్ లతో దూసుకుపోతున్న హీరోయిన్ సమంత. ఈమె తన నటన, అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తుంటుంది. ఇక ఈమెకు మాత్రం బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రన్బీర్ కపూర్ అంటే చాలా ఇష్టమట. రన్బీర్ అంటే తనకు ఎంతో ఇష్టమని..అతనికి జోడీగా నటించాలని ఉందని గతంలో సమంత తన మనుసులోని కోరికను బయటపెట్టింది. ఇక బాలీవుడ్ హీరోలలో రన్బీర్ కపూర్ కు చాలా మంది అభిమానులు ఉంటారు. ఇందులో సమంత కూడా ఉండడం విశేషం.

కాజల్.. కాజల్ అగర్వాల్ కు ఇద్దరు హీరోలు ఇష్టమని గతంలోనే తెలిపింది. అందులో ఒకరు అజిత్, మరొకరు విజయ్. గతంలోనే విజయ్ తో తుపాకీ, జిల్లా, మెర్సల్ సినిమాల్లో నటించింది కాజల్. ఇక అజిత్ తో వివేగం సినిమాలో నటించింది. ఈ ఇద్దరు హీరోలు తాను నటించే సమయంలో సౌమ్యంగా ఉండేవారని..స్త్రీలంటే వారికి ఎంతో గౌరవమని..తమ సహ నటీమణులతో స్నేహపూర్వకంగా ఉంటారని తెలిపింది కాజల్. అందుకే ఇద్దరిని అభిమానిస్తున్నాను అని గతంలో కాజల్ స్వయంగా తెలిపింది. వివేగం సినిమా షూటింగ్ సమయంలో అజిత్ అంకితభావం నచ్చిందట. దీంతో ఆయన ఆ స్థాయికి ఎలా చేరుకున్నారో అర్థం అయింది అని తెలిపింది. అంతేకాదు అజిత్ మానవత్వం కాజల్ ను కదిలించింది అని తెలిపింది కూడా. విజయ్ సెట్స్ లోకి అడుగుపెడితే ఆయన ఆ సినిమా గురించి తప్ప మరో విషయం మాట్లాడరట. నటనలో సహజత్వం నచ్చిందట. అయితే ఎన్నో సినిమాల్లో నటించినా ఎవరి ప్రస్తావన తీసుకురాలేదు కాజల్. కానీ వీరిద్దరిపై ఉన్న అభిమానాన్ని మాత్రం చాటుకుంది.

శృతిహాసన్.. కమల్ హాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీలో రంగ ప్రవేశం చేసిన శృతిహాసన్ కెరీర్ లో మాత్రం తండ్రి పేరు వాడకుండానే ఎదిగింది. తన నటనతో ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకుంది. అయితే ఇప్పటివరకు తాను కలిసి పనిచేసిన హీరోలలో ఫేవరెట్ కోస్టార్ అంటే ప్రభాస్ అని తెలిపింది అమ్మడు. షూటింగ్ లొకేషన్ లో ప్రభాస్ అందరిని రిసీవ్ చేసుకునే విధానం, ఆయన లొకేషన్ లో ఉన్నవారికి ఫుడ్ తీసుకురావడం, అందరితో ఎంతో చనువుగా మూవ్ అవడం తనకు నచ్చుతాయని తెలిపింది. బాహుబలి రేంజ్ హిట్ ఉన్నా.. కూడా అందరితో క్లోజ్ గా మూవ్ అవుతారట. అందుకే తన ఫేవరెట కోస్టార్ అయ్యారని శృతిహాసన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular