Hamas Commander: శత్రుదుర్భేద్యమైన ఇజ్రాయిల్ చిగురుటాకులా వణుకుతోంది. వందలాది మంది సైనికులు హమాస్ తీవ్రవాదుల దాడుల్లో కన్నుమూశారు. ఐరన్ డ్రోమ్ లాంటి వ్యవస్థ ఉన్నప్పటికీ ఇజ్రాయిల్ తనను తాను కాపాడుకోవడానికి కిందా మీదా పడుతోంది. అచంచలమైన రక్షణ వ్యవస్థ ఉన్న ఇజ్రాయిల్ ఈరోజు ఈ స్థాయిలో ఇబ్బంది పడటానికి కారణం ఒకే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ప్రతీకారం ముందు ఇజ్రాయిల్ తేలిపోయింది. వందల మంది సైనికులను కోల్పోయింది. అధునాతనమైన తన రక్షణ వ్యవస్థలనూ పోగొట్టుకుంది.. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి? ఇంతటి మారణకాండకు అతడు ఎలాంటి ప్రణాళిక రూపొందించాడు?
వారం క్రితం యూదుల మ్యూజిక్ ఫెస్టివల్ సుక్కోత్ ముగింపు దశకు చేరింది. ఈ క్రమంలో ఇజ్రాయిల్ దేశంలోకి వేలాది రాకెట్లు దూసుకు వచ్చాయి.. 1200 మందికి పైగా ఇజ్రాయిల్ దేశస్తులు పాలస్తీనా విమోచన తీవ్రవాద సంస్థ హమాస్ జరిపిన ఈ మెరుపు దాడుల్లో మరణించారు.. గాజా పట్టి ప్రాంతంలో పాలస్తీనా అరబ్బులను ఓపెన్ ఎయిర్ జైల్లో బంధించిన నేరానికి ప్రతీకారంగా హమాస్ చేసిన దిగ్భ్రాంతికర దాడికి పథకం రూపొందించింది మహమ్మద్ దెయిఫ్(58). హమాస్ అనుబంధ సంస్థ ఇజ్జెదిన్ అల్ ఖాసమ్ బ్రిగేడ్స్ నేత దెయిఫ్. గాజా హమాస్ నేత యాహ్యా సిన్వార్ తో కలిసి “తుఫాన్ అల్_ అక్సా” పేరు తో యూదు రాజ్య భూభాగాలపై రాకెట్ల వర్షం కురిపించాలని దెయిఫ్ నిర్ణయించాడు. ఈ ఇద్దరు పాలస్తీనియన్లు ఈ తుఫాన్ ను ఇజ్రాయిల్ లో మారణకాండ కు దారి తీసే విధంగా చేయగలిగారు. ఈ దాడి వెనుక రెండు రకాల మెదడులు పనిచేసినప్పటికీ.. ఒకే ఒక సూత్రధారి పథకం రూపొందించాడు. అతడి పేరు ఒంటికన్ను రాక్షసుడు( ఒన్ ఐయిడ్ జాక్).
కొన్ని సంవత్సరాల క్రితం ఇజ్రాయిల్ రక్షణ బలగాలు జరిపిన దాడుల్లో దెయిఫ్ ఒక కన్ను, కొన్ని శరీర భాగాలు కోల్పోయాడు. ఇక మళ్ళీ పోరాడడానికి దిగే దెయిఫ్ కోలుకోడని, ఒంటి కన్నుతో అతని బతుకు దుర్భరం అవుతుందని యూదులు అనుకున్నారు. అయితే ఇప్పటివరకు ఇజ్రాయిల్ దాడుల నుంచి రెండుసార్లు తప్పించుకుని ప్రాణాలతో బయటపడిన దెయిఫ్.. కన్ను కోల్పోయినప్పటికీ బుర్ర పనిచేయడం మాత్రం ఆగలేదు. ” దెయిఫ్ ఒక కన్ను పోగొట్టుకున్న తర్వాత సైనిక వ్యూహాలు అతడి వల్ల కావు అనుకున్నాం. కానీ అతడు చాలా వరకు కోలుకున్నాడు. ఒక కన్ను పోవడం అంటే ఒక కన్ను కోల్పోవడమే కదా” అని ఇజ్రాయిల్ దేశానికి చెందిన విశ్రాంత సైనికాధికారి వ్యాఖ్యానించారు. 2014లో ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడిలో గాజాలోని దెయిఫ్ భార్య, కూతురు, మారుడు కన్నుమూశారు. దెయిఫ్ 1965లో ఈజిప్ట్ అక్రమంలో ఉన్న గాజాస్ట్రిప్ లోని ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరంలో
దెయిఫ్ జన్మించాడు. మస్రి నుంచి దెయిఫ్ అని పేరు మార్చుకున్నాడు. దెయిఫ్ అంటే అరబ్బీ భాషలో అతిధి అని అర్థం. గాజా ఇస్లామిక్ యూనివర్సిటీలో డిగ్రీ చదివిన దెయిఫ్ ను.. ఇజ్రాయిల్ దళాలు 1987లో అరెస్టు చేసి 16 నెలలపాటు నిర్బందించాయి. అయితే ఈ ఒంటి కన్ను వీరుడు.. 75 ఏళ్ల చరిత్రలో కనివిని ఎరుగని స్థాయిలో ఇజ్రాయిల్ దేశాన్ని దెబ్బతీయడం విశేషం. “తుఫాన్ అల్ అక్సా” పేరుతో రాకెట్ల తో దాడి చేసి ఇజ్రాయల్ ను వణికించాడు దెయిఫ్.