Homeక్రైమ్‌Rajasthan: క్షేమంగా దింపుతానంటే కంపెనీ కారులో వెళ్ళింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Rajasthan: క్షేమంగా దింపుతానంటే కంపెనీ కారులో వెళ్ళింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Rajasthan: నేటి కాలంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. ఎవరు ఏ క్షణంలో ఏం చేస్తారో, ఎవరు ఈ క్షణంలో ఎలా మారిపోతారు.. అంతు పట్టడం లేదు. పైగా నమ్మిన పాపానికి దారుణాలకు పాల్పడుతున్నారు. ఘోరాలకు ఒడిగడుతున్నారు. అటువంటిదే ఈ దారుణం కూడా..

రాజస్థాన్లోని ఉదయపూర్ ప్రాంతంలో ఘోరం జరిగింది. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి వద్ద క్షేమంగా దింపుతారని సొంత కంపెనీ కారులో వెళ్లిన పాపానికి.. అందులో ప్రయాణిస్తున్న ఉన్నతాధికారులు ఆమెను ఇబ్బంది పెట్టారు. ఐటీ మేనేజర్ అని చూడకుండా నరకం చూపించారు. ఈ ఘటన కాస్త ఐటి రంగంలో మహిళలకు భద్రత అనేది నేతిబీర అని నిరూపించింది.

శనివారం రాత్రి కంపెనీలో సీఈవో జన్మదిన వేడుకలు నిర్వహించారు. శరీరం రాత్రి 9 గంటలకు మొదలైన ఆ పార్టీ ఆదివారం (డిసెంబర్ 20) తెల్లవారు జామున 1:30 గంటల దాకా సాగింది. పార్టీ ముగిసిన తర్వాత ఐటీ మేనేజర్ ఒక్కరే ఉన్నారు. దీంతో ఆ కంపెనీకి సంబంధించిన సీఈవో, మరో మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్, ఆమె భర్త కలిసి.. ఒకే కారులో వెళ్లారు. అదే సమయంలో ఇంటి వద్ద దింపుదామని ఆ కంపెనీ మేనేజర్ ను కారులో ఎక్కించుకున్నారు.

కారు అలా వెళ్తుండగా ఒక షాపు వద్ద ఆపారు. కొన్ని రకాల పదార్థాలను కొనుగోలు చేశారు. వాటిని ఐటి మేనేజర్ బలవంతంగా తీసుకునే విధంగా చేశారు. ఆ పదార్థాలు తీసుకున్న తర్వాత మేనేజర్ స్పృహ తప్పి పడిపోయింది. ఇదే అతనుగా కారులో ఉన్న సీఈవో, మహిళా ఎగ్జిక్యూటివ్ భర్త ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు ఐటీ మేనేజర్ ఫిర్యాదు చేశారు. అంతేకాదు తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఆమెను ఇంటి వద్ద వారు వదిలిపెట్టి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఆ మహిళ స్పృహలోకి వచ్చింది. తనపై లైంగికదాడు జరిగినట్టు గుర్తించింది. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.. దీనికి సంబంధించిన వీడియోలు కారులో ఉన్న డాష్ క్యామ్ లో రికార్డ్ అయ్యాయి. ఈ కేసులో ఇది అత్యంత కీలకమైన సాక్ష్యంగా మారుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్యవహారాల్లో ఇప్పటికే ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు ప్రకటించారు. అంతేకాదు వారిని విచారిస్తున్నామని ఉదయపూర్ ఎస్పీ యోగేష్ తెలిపారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తు బాధ్యతను అదనపు ఎస్పీకి అప్పగించారు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular