Sangareddy: ఒక బంధం ఏర్పడాలంటే.. అది మరింతగా బలపడాలంటే సరైన వయసు ఉండాలి. సరైన వయసు ఉంటేనే మానసికంగా పరిపక్వత వస్తుంది. మానసికంగా పరిపక్వత లేకుండా ఏర్పడిన బంధాలు బలంగా ఉండవని పెద్దలు అంటుంటారు. నేటి కాలంలో పరిపక్వతతో సంబంధం ఉండడం లేదు. బంధాలకు వయసుతో అవసరం ఉండడం లేదు. అందువల్లే దారుణాలు జరుగుతున్నాయి. ఈ స్థాయిలో ఘోరాలు జరుగుతున్నప్పటికీ జనాలు మారడం లేదు. మారాలని అనుకోవడం లేదు.
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో ఓ తల్లి, కొడుకు హత్యకు గురయ్యారు. మరో యువకుడు గొంతు కోసుకున్నాడు. ఈ ఘటనలు ఆ ప్రాంతంలో కలకలాన్ని కలిగించాయి. చనిపోయిన తల్లీకొడుకు , గొంతు కోసుకున్న యువకుడి మధ్య సంబంధం ఏంటని స్థానికులు ఆరా తీయగా.. దారుణమైన విషయాలు వెలుగు చూశాయి.
ఉమ్మడి పాలమూరు జిల్లా వనపర్తికి చెందిన చంద్రకళ కొంతకాలంగా సంగారెడ్డి పట్టణంలోని కొల్లూరు పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న జెపి కాలనీలో ఉంటున్నది. ఆమెకు ఒక కుమారుడు కూడా. చంద్రకళతో నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలం కాలనీ గ్రామానికి చెందిన శివ సహజం సాగిస్తున్నాడు. చంద్రకళకు గతంలోనే వివాహం జరిగింది. ఆమెకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఏం జరిగిందో తెలియదు గానీ బుధవారం రాత్రి చంద్రకళ, ఆమె కుమారుడు రేవంత్ ను శివ అంతం చేశాడు. ఆ తర్వాత తనను తాను గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన శివను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
చంద్రకళ, రేవంత్ మృత దేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై సంగారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు మొదలుపెట్టారు. హత్యకు దారి తీసిన పరిస్థితుల గురించి ఆరా తీస్తున్నారు. చంద్రకళ, శివ తమను తామ భార్యాభర్తలుగా పరిచయం చేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పట్టణంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.. చంద్రకళ, రేవంత్ మృతదేహాలను తీసుకెళ్లడానికి వారి కుటుంబ సభ్యులు వచ్చారు. అయితే వారు చెబుతున్న వివరాలను పోలీసులు నమోదు చేసుకున్నారు.