Homeక్రైమ్‌Prajwal Revanna : అది ఫామ్ హౌస్ కాదు.. రాసలీలల విడిది.. ఊరు వదిలి పారిపోయిన...

Prajwal Revanna : అది ఫామ్ హౌస్ కాదు.. రాసలీలల విడిది.. ఊరు వదిలి పారిపోయిన రేవణ్ణ బాధితులు

Prajwal Revanna : అది కర్ణాటక రాష్ట్రం హసన్ పార్లమెంటు నియోజకవర్గం. అక్కడ ఒక ఫామ్ హౌస్ ఉంటుంది. దానికి ఒక కానిస్టేబుల్ కాపలాగా ఉంటాడు. ప్రతిరోజు అందులోకి మాజీ ప్రధాని దేవే గౌడ మనవడు, హసన్ పార్లమెంట్ సభ్యుడు ప్రజ్వల్ రేవణ్ణ కారులో వస్తాడు. అతని వాహనంలో అందమైన అమ్మాయిలు ఉంటారు. లోపలికి వెళ్లి రాసలీలలు సాగిస్తారు. అలా సాగించే క్రమంలో వీడియో తీస్తాడు. ఆ తర్వాత వారిని బెదిరిస్తాడు. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు వందలాది సంఖ్యలో బాధితులు ఉన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారానికి సంబంధించి ఇటీవల ఆ దృశ్యాలు వెలుగులోకి రావడంతో.. కర్ణాటక వ్యాప్తంగా కలకలం చెలరేగింది. పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ వ్యవహారం తెరపైకి రావడంతో కాంగ్రెస్ పార్టీ దీనిని అనుకూలంగా మలచుకుంది. క్రమేపీ ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంతో.. దీనికి సంబంధించి రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. రేవణ్ణ రాసలీలకు సంబంధించిన వీడియోలు ప్రసారం కావడంతో.. అతని చేతిలో లైంగిక వేధింపులకు గురైన మహిళలు ప్రస్తుతం హసన్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఇందులో పలువురు మహిళలు గత పది రోజులుగా తమ ఇళ్ళను వదిలి ఎక్కడికో వెళ్లిపోయారని వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారం తెరపైకి రావడంతో ప్రజ్వల్ ఏప్రిల్ 26న దేశం విడిచి వెళ్లిపోయాడు. ఈలోగా కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి హోలే నర్సిపూర్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణను అరెస్ట్ చేసింది.

Prajwal Revanna
Prajwal Revanna Form House

ప్రజ్వల్ రేవణ్ణ తన ఇంట్లో పని చేసిన ఓ మహిళతో రాసలీలలు జరుపుకుంటూ వీడియోలు తీశాడు. అవి బయటకు రావడంతో ఒక్కసారిగా కలకలం నెలకొంది. వివిధ టీవీ చానల్స్ వాటిని ప్రసారం చేయడంతో రేవణ్ణ ఇంట్లో పని చేసిన మహిళ బయటికి వెళ్లిపోయింది. ఆమె ఎక్కడ ఉందో ఇప్పటికీ తెలియదు. ఆమె ఇంటికి తాళం వేసి ఉందని పొరుగు వారు చెప్తున్నారు. రేవణ్ణ ఇంట్లో పనిమనిషి పై మాత్రమే కాదు.. జెడిఎస్ పార్టీకి చెందిన చాలామంది నాయకురాళ్లతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడనే ఆరోపణలు ఉన్నాయి.. అతని రాసలీలల వ్యవహారం బయటకు రావడంతో చాలామంది మహిళలు తమ సోషల్ మీడియా ఖాతాలలో రేవణ్ణ తో దిగిన ఫోటోలను డిలీట్ చేశారు. అంతేకాదు కొంతమంది ప్రజాప్రతినిధుల భార్యలతో కూడా రేవణ్ణ రాసలీలలు జరిపినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక జిల్లా పంచాయతీ సభ్యురాలు ఒకరు.. తనపై మూడు సంవత్సరాలు రేవణ్ణ అత్యాచారం జరిపారని.. వాటిని వీడియో రికార్డు చేశారని ఆరోపించింది. ఏప్రిల్ 24న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక అప్పటినుంచి రేవణ్ణ రాసలీలల వ్యవహారం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. ప్రస్తుతం ఆ నాయకురాలు కుటుంబంతో సహా బయటికి వెళ్లిపోయింది. ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది. మరోవైపు రేవణ్ణ లైంగిక వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ యువకుడి తల్లిని కొందరు కిడ్నాప్ చేశారు.. ఆ నిందితుల్లో రేవణ్ణ కూడా ఉన్నాడని కేఆర్ నగర్ లో పోలీసులకు ఒక ఫిర్యాదు అందింది.

రేవణ్ణ రాసలీలకు సంబంధించి మీడియా ఛానల్స్ చూపించిన వీడియోల్లో మహిళల ముఖాలు బ్లర్ చేయలేదు. దీనివల్ల చాలామంది బాధిత మహిళలు హసన్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని వదిలి వెళ్లిపోయారు. బాధితులు చాలామంది ఉన్నప్పటికీ..రేవణ్ణ కుటుంబానికి భయపడి ఎవరూ ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. రేవణ్ణ తన రాసలీలలను సంబంధించి ఫామ్హౌస్ వేదికగా జరిపేవాడు. ఫామ్ హౌస్ చుట్టూ 8 అడుగుల ఎత్తైన గోడ నిర్మించారు. దానిపైన కూడా సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతానికి రేవణ్ణ అప్పుడప్పుడు ఒంటరిగా, కొన్నిసార్లు స్నేహితులతో వచ్చేవాడట. లోపల ఏం జరుగుతుందో బయట ఉన్న కాపలాదారులకు తెలిసేది కాదట. వాస్తవానికి రేవణ్ణ రాసలీలలు 2023 లో కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందే బయటకు వచ్చాయట. అయితే వాటిని టెలికాస్ట్ చేయకుండా ఉండేందుకు రేవణ్ణ తన రాజకీయ బలాన్ని ఉపయోగించాడట.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular