spot_img
Homeజాతీయ వార్తలుLok Sabha Elections: ముగిసిన తొలి విడత పోలింగ్‌..

Lok Sabha Elections: ముగిసిన తొలి విడత పోలింగ్‌..

Lok Sabha Elections: దేశంలో 2024 పార్లమెంట్‌ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ శుక్రవారం(ఏప్రిల్‌ 19న) ప్రారంభమైంది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో తొలి దశలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 స్థానాల్లో ఓటింగ్ జరుగుతోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగిసింది.

పోలింగ్‌ సరిగే స్థానాలు ఇవీ..
తమిళనాడు (39), రాజస్థాన్‌ (12), ఉత్తరప్రదేశ్‌ (8), మధ్యప్రదేశ్‌ (6), ఉత్తరాఖండ్‌ (5), అరుణాచల్‌ ప్రదేశ్‌ (2), మేఘాలయ (2) రాష్ట్రాల్లోని అన్ని స్థానాలకు తొలి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. , అండమాన్ మరియు నికోబార్ దీవులు (1), మిజోరం (1), నాగాలాండ్ (1), పుదుచ్చేరి (1), సిక్కిం (1) మరియు లక్షద్వీప్ (1). అసోం, మహారాష్ట్రలో ఐదు, బీహార్‌లో నాలుగు, పశ్చిమ బెంగాల్‌లో మూడు, మణిపూర్‌లో 2, త్రిపుర, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్‌గఢ్‌లో ఒక్కో సీట్లకు పోలింగ్‌ జరుగుతోంది. అరుణాచల్ ప్రదేశ్ (50 సీట్లు), సిక్కిం (32) అసెంబ్లీలకు మొదటి విడతలోనే ఎన్నికలు జరిగాయి.

5 గంటల వరకు పోలింగ్‌ ఇలా..
ఇక సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ ముగిసింది. అయినా క్యూలైన్లలో ఇంకా ఓటర్లు ఉండడంతో క్యూలో ఉన్నవారందరికీ ఓటే వేసే అవకాశం కల్పిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. 5 గంటల వరకు 55 శాతం పోలింగ్‌ నమోదైంది. తమిళనాడులో 60 శాతం, రాజస్థాన్‌లో 47.5 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 55 శాతం, మధ్యప్రదేశ్‌లో 58 శాతం పోలింగ్ నమోదైంది. సాధారణ ఎన్నికలతోపాటు జరుగుతున్న రాష్ట్ర ఎన్నికల విషయానికొస్తే, సిక్కిం మరియు అరుణాచల్ ప్రదేశ్‌లలో వరుసగా 60.7 మరియు 61,4 శాతం పోలింగ్ నమోదైంది. నాగాలాండ్‌లో ఆరు జిల్లాల ప్రజలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. వీరు ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌ చేస్తున్నారు.

చెదురుముదురు ఘటనలు..
బెంగాల్‌లో, కూచ్ బెహార్‌లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. ఓటర్లను భయపెట్టడం, పోల్ ఏజెంట్లపై దాడికి పాల్పడ్డారని తెలిసింది. మణిపూర్‌లోని బిష్ణుపూర్‌లోని పోలింగ్ స్టేషన్‌లో కాల్పులు జరిగాయి. ఇంఫాల్ తూర్పు జిల్లాలో ఓ పోలింగ్ స్టేషన్‌ను ధ్వంసం చేశారు. తమిళనాడులో, సేలం జిల్లాలో పోలింగ్ బూత్‌ల వద్ద ఇద్దరు వృద్ధులు మరణించారు.

మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ శాతాలు

– అండమాన్ నికోబార్ -45.48శాతం

– అరుణాచల్ ప్రదేశ్ -55.05 శాతం

– అస్సాం -60.70 శాతం

– చత్తీస్ ఘడ్ -58.14శాతం

– జమ్మూ-కాశ్మీర్ -57.07 శాతం

– లక్షద్వీప్ -43.98 శాతం

– మధ్యప్రదేశ్ -53.40 శాతం

– మహారాష్ట్ర -44.12శాతం

– మణిపూర్ -63.03 శాతం

– మేఘాలయ -61.95 శాతం

– మిజోరాం -49.77 శాతం

– నాగాలాండ్ -51.73 శాతం

– పుదుచ్చేరి -58.86 శాతం

– రాజస్థాన్ -41.51 శాతం

– తమిళనాడు -51.10 శాతం

– త్రిపుర -68.35శాతం

– ఉత్తరప్రదేశ్ -47.44 శాతం

– ఉత్తరాఖండ్ -45.62 శాతం

– పశ్చిమబెంగాల్ -66.34 శాతం

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Adani Group Airlines

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...
Srirastu Meaning

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Amazon Employee Quits Job

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...
Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...
Oppo A7 Pro Max

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు...
Oktelugu Epaper