సినిమా హీరోలపై అభిమానులకు ఎనలేని ప్రేమ ఉంటుంది. వారి కోసం ఏం చేయడానికైనా వెనుకాడని అభిమానులుంటారు. వారినే ఓ ఆరాధ్యదైవంగా భావిస్తారు. ఇక అందులో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఒకరు పవన్ నా దేవుడంటూ తనపెళ్లి శుభలేఖలపై జనసేనాని ఫొటోలను అచ్చు వేయించాడు.
శుభలేఖ బ్యాక్ గ్రౌండ్ లో కూడా పవన్ కళ్యాణ్ ఫొటోను, జనసేన పార్టీ చిత్రాన్ని ముదించాడు. విశాఖ జిల్లాకు చెందిన రాజేష్ రెడ్డి అనే అభిమాని పవన్ పై తనకున్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నాడు.
భగవంతుడుతో పోలుస్తూ పెళ్ళి కార్డ్ పై పవన్ కళ్యాణ్ ఫోటో ముద్రించిన వరుడి వ్యవహారం సంచలనంగా మారింది. విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం సీతానగరం సమీపంలో రజక వీధీకి చెందిన సుద్ధమళ్ళ ఈశ్వరరావు, ఆదిలక్ష్మీ పెద్ద కొడుకు పవన్ కుమార్ కు అలాగే ఎస్ . కోట కు చెందిన ధాత్రీకి ఈనెల 21 పెద్దలు వివాహం నిశ్చయించారు …
అయితే చిన్నప్పటి నుండి పవన్ కళ్యాణ్ అంటే అభిమానం కావడంతో కుమారుడికి కూడా తల్లిదండ్రులు పవన్ అని నామకరణం చేసారు. స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం చేస్తున్న పవన్ కుమార్ చిన్నపటి నుండి పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఆ అభిమానం కాస్తా గుండెలకు తాకి తనకు భగవంతుడు అని పవన్ కళ్యాణ్ అని అంటున్నాడు వరుడు.
మరో అడుగు ముందుకు వేసిన పెళ్లి కొడుకు ఏకంగా పెళ్ళి కార్డ్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోను ముద్రించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.