
లార్ట్స్ టెస్ట్ విజయంలో సెంచరీతో కీలకపాత్ర పోషించిన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ హీరో కేఎల్ రాహుల్ మ్యాచ్ తర్వాత ప్రత్యర్థికి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. తన పనేదో తాను చేసుకెళ్తూ ఫీల్డ్ లో చాలా కామ్ గా కనిపించే రాహుల్ ఈసారి కాస్త ఘాటుగానే స్పందించాడు. రెండో టెస్ట్ లో ఇంగ్లాండ్ ప్లేయర్స్ పదేపదే రెచ్చగొట్టేలా వ్యవహరించిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్ ఇలా స్పందించాడు. మీరు టీమ్ లో ఒక్కరిని వేధిస్తే.. మొత్తం టీమ్ లోని 11 మంది మీ వెంట పడతారు అని ఇంగ్లాండ్ కు హెచ్చరికలు జారీ చేశారు.