spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: మంత్రులకు చేతినిండా పని పెట్టిన పవన్‌.. అట్లుంటది పవర్‌ స్టార్‌తోని!

Pawan Kalyan: మంత్రులకు చేతినిండా పని పెట్టిన పవన్‌.. అట్లుంటది పవర్‌ స్టార్‌తోని!

Pawan Kalyan: వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా పావులు కదుపుతున్న జనసేనాని, పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.. అధికార, ప్రతిపక్ష హోదా లేకపోయిన జన నేతగా దూసుకుపోతున్నారు. పాలక పక్షాన్ని చెడుగుడు ఆడుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలే అస్త్రంగా ప్రజాక్షేత్రంలో వైసీపీని ఎండగడుతున్నారు. ఈ క్రమంలో మంత్రులు, అధికార పార్టీ నేతలు డిఫెన్స్‌లో పడుతున్నారు. పవన్‌ ఎంచుకుంటున్న సమస్యలపై సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏపీ మంత్రులకు ఏర్పడుతోంది. లేదంటా పని చేయాల్సి వస్తోంది. తాజాగా జనసేనాని ఏపీ మంత్రులకు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ చేతి నిండా పని పెట్టారు.

Pawan Kalyan
Pawan Kalyan

గర్జనపై నిలదీత..
సోషల్‌ మీడియాకు చాలా వరకు దూరంగా ఉండే పవన్‌ కళ్యాణ్‌ అకస్మాత్తుగా సోషల్‌ మీడియా తెరపై ప్రత్యక్షమయ్యారు. ‘దేనికీ గర్జన’ అ ంటూ ట్విటర్‌ వేదికగా పాలకపక్షాన్ని నిలదీశారు. దీంతో పవన్‌కు కౌంటర్‌ ఇచ్చేందుకు ఏపీ మంత్రులు క్యూ కట్టారు. ఇదంతా చంద్రబాబు కోసమే అంటూ మంత్రులు పవన్‌పై విరుచుకుపడుతున్నారు. దత్త తండ్రి కోసం దత్త పుత్రుడి ట్వీట్లగా అభివర్ణించారు. ఏపీ మంత్రుల ఎదురు దాడి పవన్‌ కల్యాణ్‌లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.

మరోసారి ట్విటర్‌ వేదికగా..
జగన్‌ ప్రభుత్వంపై తన మార్క్‌ సెటైర్స్‌తో ట్విట్టర్‌లో పవన్‌ మళ్లీ ప్రత్యక్షమయ్యారు. రాజధాని అంశంపై పవన్‌ కళ్యాణ్‌ వ్యంగ్యాస్త్రాన్ని సంధించడం చర్చకు దారి తీసింది. ఏపీని ఏకంగా యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ ఆంధ్రగా ప్రకటించాలని తీవ్రస్థాయిలో పవన్‌ వెటకరించారు.

వ్యంగ్య ట్వీట్‌ ఏంటంటే...
‘వికేంద్రీకరణే సర్వతోముఖాభివృద్ధికి మంత్రం అనుకుంటే మూడు రాజధానులే ఎందుకు… 25 జిల్లాలను రాష్ట్రాలుగా ప్రకటించి 25 రాజధానులను ఏర్పాటు చేయండి. చట్టం, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగానికి మీరు అతీతం అన్నట్టు మీరు భావిస్తుంటారు. అలాగే ప్రవర్తిస్తుంటారు కదా! ప్రజాభిప్రాయంతో సంబంధం లేదు కదా మీకు? ఏ మాత్రం సంకోచించకండి. రాష్ట్రంలో వైసీపీ రాజ్యాంగాన్ని అమలు చేయండి’ అంటూ ఆయన వ్యంగ్య ట్వీట్‌ చేశారు.

Pawan Kalyan
Pawan Kalyan

వైసీపీకి చిర్రెత్తేలా..
పవన్‌ చేసిన ట్వీట్‌ వైసీపీ నేతలకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ఏపీ మంత్రులు ఎంత ఎక్కువ ఎదురు దాడి చేస్తే… అంతకు రెట్టింపుగా రియాక్ట్‌ అవుతానని పవన్‌ కళ్యాణ్‌ తన చర్యలతో చెప్పకనే చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ తాజా ట్వీట్‌కు వైసీపీ మంత్రుల నుంచి కౌంటర్స్‌ ఆసక్తి కలిగిస్తాయనడంలో సందేహం లేదు. గర్జన బిజీలో ఉన్న మంత్రులు ఇప్పటికైతే పవన్‌ ట్వీట్‌పై స్పందించలేదు. ధర్మాన ప్రసాదరావు ప్రెస్‌మీట్‌ పెట్టినా.. టీడీపీపైనే విరుచుకుపడ్డారు. పవన్‌ ట్వీట్‌పై మాత్రం నోరు మెదపకపోవడం గమనార్హం.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper