Jana Sena Leaders: ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు అధ్వాన స్థితిలోకి చేరాయి. ఎటు చూసినా గుంతలమయంగా మారుతోంది. రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై ఇదివరకే జనసేన సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియజేసింది. కానీ ప్రభుత్వంలో మాత్రం చలనం రాలేదు. దీంతో రోడ్ల పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారిపోతున్నాయి. సంక్షేమ పథకాలపై ఉన్న మక్కువ అభివృద్ధి పనుల మీద లేదు. దీంతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు కనిపించడం లేదు. దీంతో వైసీపీ నేతల నిర్వాకంతో రోడ్లు గుంతలతో నిండిపోతున్నాయి. కానీ వాటిలో తట్టెడు మట్టి కూడా పోయడం లేదు.

వర్షాకాలం కావడంతో ఎటు చూసినా రోడ్లు గుంతలతో దర్శనమిస్తున్నాయి. నడవడానికి కూడా వీలు లేకుండా పోతోంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం ముగండ నుంచి పోతవరం వెళ్లే రోడ్డు గుంతలుగా మారింది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు దుస్థితిపై ఎన్నిమార్లు వినతిపత్రాలు అందజేసినా ప్రభుత్వంలో చలనం లేదు. దీంతో జనసైనికులే మేలుకున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేసినా ఫలితం లేకుండా పోయింది.
ఇక ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఆలోచించకుండా జనసేన పార్టీ నేతలే బాగు చేయాలని భావించారు. పార్టీ నేత సాధనాల శ్రీనివాస్ నేతృత్వంలో రోడ్డు బాగు చేయాలని కార్యాచరణ ప్రణాళిక రచించారు. దానికి అయ్యే ఖర్చు అంచనా వేసి పార్టీ నేతలే రోడ్డు నిర్మాణానికి పూనుకున్నారు. దీంతో కూడా ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా కాలేదు. జనసేన పార్టీ వారికి పైసలు బాగున్నాయనే వాదన తెస్తూ వారిలోని పిచ్చితనం బయటపెట్టుకుంటున్నారు. జనసేన పార్టీ నేతలు చేస్తున్న దానికి వైసీపీ నేతలకు పాలుపోవడం లేదు.

నిద్ర పోతున్న ప్రభుత్వాన్ని ఎంత విమర్శించినా తనకు ఏ మాత్రం కనువిప్పు కలగడం లేదు. అధికారులు సైతం పెడచెవిన పెడుతున్నారు. ఫలితంగా రోడ్లు గుంతలుగానే ఉండిపోతున్నాయి. రోడ్లను బాగు చేయాలని జనసేన పార్టీ ఎన్ని మార్లు మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో రహదారుల పరిస్థితి మరీ దారుణంగా మారిపోతోంది. నడవడానికి కూడా వీలు లేకుండా పోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా ఉండటం లేదు. ఇక చేసేది లేక జనసేన పార్టీ నేతలు గుంతలు పూడ్చినా అధికార పార్టీ నేతల్లో కనువిప్పు కానరావడం లేదు. భవిష్యత్ లో కూడా రోడ్లను పట్టించుకున్న పాపాన పోవడం లేదని చెబుతున్నారు.