Homeఅంతర్జాతీయంPakistan Politics: మోదీని చూసి నేర్చుకోండి.. పాక్‌లో కొత్త దుమారం మొదలైంది..

Pakistan Politics: మోదీని చూసి నేర్చుకోండి.. పాక్‌లో కొత్త దుమారం మొదలైంది..

Pakistan Politics: పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సోదరి అలీమా ఖాన్‌ ఇటీవల చేసిన ప్రకటనలు దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చను రేకెత్తించాయి. విద్యార్థుల ఆందోళనలపై భారత ప్రభుత్వం చూపిన స్పందనను ఉదహరిస్తూ ఆమె పాక్‌ అధికార వ్యవస్థపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజల సమస్యలను వినే సంస్కృతిని అలవర్చుకోవాలని, గొంతు అణచివేయడం కాకుండా వారి ఆవేదనను గౌరవించాలని సూచించారు. భారత ప్రభుత్వంపై ప్రశంసలు.. ఇటీవల పాకిస్తాన్‌లో విద్యార్థులు, కార్యకర్తలు చేపట్టిన నిరసనలపై భద్రతా […]

Pakistan Politics: పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సోదరి అలీమా ఖాన్‌ ఇటీవల చేసిన ప్రకటనలు దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చను రేకెత్తించాయి. విద్యార్థుల ఆందోళనలపై భారత ప్రభుత్వం చూపిన స్పందనను ఉదహరిస్తూ ఆమె పాక్‌ అధికార వ్యవస్థపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజల సమస్యలను వినే సంస్కృతిని అలవర్చుకోవాలని, గొంతు అణచివేయడం కాకుండా వారి ఆవేదనను గౌరవించాలని సూచించారు.

భారత ప్రభుత్వంపై ప్రశంసలు..
ఇటీవల పాకిస్తాన్‌లో విద్యార్థులు, కార్యకర్తలు చేపట్టిన నిరసనలపై భద్రతా బలగాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదే సమయంలో భారత్‌లో నీట్‌ యూజీ పరీక్షల్లో అవకతవకలు, పేపర్‌ లీక్‌ ఆరోపణలు, గ్రేస్‌ మార్కుల వివాదం నేపథ్యంలో విద్యార్థులు దేశవ్యాప్తంగా రోడ్డెక్కారు. ఢిల్లీ జంతర్‌ మంతర్‌ సహా పలు ప్రాంతాల్లో నిరసనలు నిర్వహించి పరీక్ష రద్దు, బాధ్యులపై చర్యలు డిమాండ్‌ చేశారు. వివాదం తీవ్రమవడంతో కేంద్రం విచారణలు చేపట్టి పరీక్ష నిర్వహణలో సంస్కరణలు, లీక్‌లపై కఠిన చర్యలు తీసుకుంది. నిరసనకారులతో చర్చలు జరిగాయి. తర్వాత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయడంతో విద్యార్థులు తమ ఆందోళనలను విరమించారు. ఈ విధంగా ప్రజల గొంతుకు ప్రభుత్వం స్పందించిన తీరును అలీమా ప్రశంసించారు. భారత్‌లో విద్యార్థులు రోడ్డెక్కితే అధికార యంత్రాంగం స్పందిస్తుంది. కానీ ఇక్కడ ప్రశ్నించిన వారికి అరెస్టులు, కేసులు, బెదిరింపులే ఎదురవుతున్నాయి. ప్రజాస్వామ్యం అంటే గొంతు అణచివేయడం కాదు అని మండిపడ్డారు. అధికార వ్యవస్థ ప్రజల హక్కులను గౌరవించకపోవడం దేశ భవిష్యత్తుకు మంచిది కాదని హెచ్చరించారు. ‘‘మోదీ సర్కార్‌ను చూసి నేర్చుకోండి’’ అంటూ పాక్‌ పాలకులకు హితవు పలికారు.

రాజకీయవర్గాల్లో ఆగ్రహం..
ఈ ప్రకటనలు వెలువడిన వెంటనే అధికార పక్షం నేతలు తప్పుపట్టారు. పాకిస్తాన్‌ను భారత్‌తో పోల్చడం సరికాదని అన్నారు. మరోవైపు ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ పీటీఐ నాయకులు మాత్రం మద్దతు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే విమర్శలను స్వీకరించే సంస్కృతి అవసరమని అభిప్రాయపడ్డారు. ఇమ్రాన్‌ ఖాన్‌ జైలులో ఉండగా ఆయన కుటుంబ సభ్యులు తరచూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులను అణచివేస్తున్నారని, న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలీమా చేసిన వ్యాఖ్యలు భారత్‌–పాక్‌ పోలికలకే కాకుండా పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్య పరిస్థితులు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.

ప్రస్తుతం ఈ అంశం సోషల్‌ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది. కొందరు ఆమె అభిప్రాయాలను సమర్థిస్తుండగా, మరికొందరు భారత్‌ను ఉదాహరణగా చూపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏదేమైనా ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్‌ రాజకీయాల్లో కొత్త దుమారానికి తెరలేపాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper