Homeఆంధ్రప్రదేశ్‌Vidadala Rajini: ఉన్నట్టుండి కనిపించకపోయిన ఆ మాజీ మంత్రి!

Vidadala Rajini: ఉన్నట్టుండి కనిపించకపోయిన ఆ మాజీ మంత్రి!

Vidadala Rajini: చిన్న వయసులోనే రాజకీయంగా పదవులు దక్కించుకున్న వారు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి వారిలో మాజీ మంత్రి విడదల రజిని ఒకరు. 32 సంవత్సరాల కి ఎమ్మెల్యే అయ్యారు. ఏకంగా ఈ రాష్ట్రానికి మంత్రి అయ్యారు. తెలుగుదేశం పార్టీ నుంచి జంప్ చేసిన కొద్ది రోజులకే అవకాశాలు చేజిక్కించుకున్నారు. వైసిపి హయాంలో ఒక వెలుగు వెలిగారు. కానీ ఇప్పుడు ఎన్నికల్లో ఓటమి తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేరు. మధ్య మధ్యలో బాగానే కనిపిస్తున్నారు. […]

Vidadala Rajini: చిన్న వయసులోనే రాజకీయంగా పదవులు దక్కించుకున్న వారు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి వారిలో మాజీ మంత్రి విడదల రజిని ఒకరు. 32 సంవత్సరాల కి ఎమ్మెల్యే అయ్యారు. ఏకంగా ఈ రాష్ట్రానికి మంత్రి అయ్యారు. తెలుగుదేశం పార్టీ నుంచి జంప్ చేసిన కొద్ది రోజులకే అవకాశాలు చేజిక్కించుకున్నారు. వైసిపి హయాంలో ఒక వెలుగు వెలిగారు. కానీ ఇప్పుడు ఎన్నికల్లో ఓటమి తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేరు. మధ్య మధ్యలో బాగానే కనిపిస్తున్నారు. మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. తాజాగా ఇప్పుడు ఆమె పెద్దగా కనిపించడం లేదు.. దీంతో లోతైన చర్చ నడుస్తోంది. పార్టీకి ఆమె దూరమవుతున్నారా? పార్టీ దూరం పెట్టిందా? అనే దానిపై చర్చ నడుస్తోంది.

* టిడిపి ద్వారా ఎంట్రీ..
తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రజిని. ఆ పార్టీలో ఉన్న తక్కువ సమయంలోనే అధినేత చంద్రబాబు దృష్టిని ఆకర్షించారు. ఓ సమావేశంలో అయితే తాను చంద్రబాబు నాటిన మొక్కనని.. ఆయన కట్టిన హైటెక్ సిటీలో ఉద్యోగం చేసి.. అక్కడి నుంచి అమెరికా వెళ్లి ఈ స్థాయికి వచ్చానని చెప్పుకున్నారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ని తిట్టడం ద్వారా ఫేమస్ అయ్యారు. కానీ 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఆ పార్టీ టికెట్ తగ్గించుకున్నారు. అప్పుడు మంత్రిగా ఉన్న ప్రతి పార్టీ పుల్లారావును ఓడించి జెయింట్ కిల్లర్ గా నిలిచారు. మొదటి ప్రయత్నంలోనే టిడిపిలో కీలక నేతగా ఉన్న పుల్లారావును ఓడించి మంచి గుర్తింపు సాధించారు. జగన్మోహన్ రెడ్డి దృష్టిని ఆకర్షించి మంత్రి అయ్యారు.

* ఎన్నికల్లో ఓటమితో..
మొన్నటి ఎన్నికల్లో మాత్రం రజిని ఓడిపోయారు. ఆమె నియోజకవర్గాన్ని జగన్ మార్చారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అక్కడ కూడా దారుణంగా ఓడిపోయారు. రాష్ట్రంలో పార్టీ ఓడిపోయిన తర్వాత వైసిపి కార్యక్రమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ వచ్చారు. అలా యాక్టివ్ అవుతున్న క్రమంలో కొన్ని రకాల కేసులు ఎదుర్కొన్నారు. అయితే ఎన్ని కేసులు ఎదురైనా.. పార్టీని విడిచి పెట్టే ఛాన్స్ లేదని తెలిసి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలకు హాజరవుతూ వచ్చారు. కూటమి ప్రభుత్వంపై గట్టిగానే కౌంటర్ ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ఆమె పెద్దగా కనిపించకపోవడం చర్చకు దారితీస్తోంది. పార్టీ ఆమెను పక్కన పెట్టిందా? లేకుంటే ఆమె దూరంగా జరిగిపోయారా? అనేది తెలియాల్సి ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper