CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు నాల్కల ధోరణి సంగతి అందరికి తెలిసిందే. వైపైతే ఇటు జోపుడైతే అటు అనే సామెత ప్రకారం కేసీఆర్ తన మాటలను మారుస్తుంటారు. తొండ ముదిరి ఊసరవెళ్లి అయినట్లు కేసీఆర్ కూడా రంగులు మారుస్తుంటారు. ఏదైనా తనకు అనుకూలంగా లేకపోతే దానిపై రాద్ధాంతం చేయడం తనకు నచ్చితే చెడునైనా అందలాలెక్కించడం ఆయనకున్న అలవాటు. దీంతో తన పేరు శిలాఫలకం మీద చెక్కించలేదనే ఉద్దేశంతో ఆధ్యాత్మిక గురువు చిన్నజీయర్ స్వామినే పక్కన పెట్టిన వైనం అందరికి తెలిసిందే.

ఇక హుజురాబాద్ ఓటమి తరువాత బీజేపీని టార్గెట్ చేసుకుని మరీ చెలరేగిపోతున్నారు. అంతకుముందు ప్రతిసారి ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలవడం తన వ్యక్తిగత పనులు చేసుకోవడం వంటి పనులు చేసిన కేసీఆర్ ప్రస్తుతం బీజేపీ మీద ఫైర్ అవుతున్నారు.
Also Read: Global Financial Crisis: మాంద్యం ముంగిట ప్రపంచం
కేంద్రంతో పెట్టుకుంటే ఎవరికి నష్టం. నీవో రాష్ట్రానికి మాత్రమే అధికారం చెలాయించగలవు. కానీ ప్రధాని దేశానికే నేత. ఆయనతో పెట్టుకుని బతికి బట్టగలవా? అని పలువురు ప్రశ్నిస్తున్నా మొండిగా వ్యవహరిస్తూ మూడో కూటమి అంటూ ఉన్న స్థానాన్ని కూడా దూరం చేసుకునే ప్రయత్నంలో పడిపోయారు.
గతంలో చాలా సార్లు విలేకరుల సమావేశం నిర్వహించినప్పుడు జర్నలిస్టులు ప్రశ్నిస్తే చాలు వారిపై అగ్గిమీద గుగ్గిలం వేసినట్లు రెచ్చిపోయి మాట్లాడిన సంఘటనలున్నాయి. దీంతో ఎవరు కూడా ప్రశ్నించడానికే జంకుతున్నారు. ఎందుకంటే వారిని సమావేశంలోని ఎడాపెడా మాట్లాడి నోరు మూయించడం కేసీఆర్ నైజం. అదే అవసరమైతే మీరు దేశాన్ని మార్చే సత్తా ఉన్న వారు. మీరు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. రోజు ఎన్నో వార్తలు చూస్తుంటారు. ఎన్నో విషయాలు సేకరిస్తుంటారు అంటూ అందలాలు ఎక్కిస్తారు.
దీనిపై ప్రస్తుతం విస్తృతంగా చర్చ జరుగుతోంది. కేసీఆర్ వైఖరి ఏంటనే దానిపై స్పష్టత కనిపించడం లేదు. జాతీయ రాజకీయాలా? రాష్ట్రంలోనే కొనసాగుతారా? మూడో కూటమి ఏమైంది? బీజేపీని ఎదుర్కొంటాం? బంగాళాఖాతంలో కలిపేస్తాం అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఇప్పుడు ముఖం చాటేయడం ఏమిటి. కేసీఆర్ లో ఆ సత్తా తగ్గిందా? లేక కొడుకు కోసం ఇంకా ఏవైనా మార్గాలు వెతుకుతున్నారా? కొడుకును సీఎం చేయడం, కూతురును కేంద్రానికి పంపడమే మిగిలి ఉన్న ఆశలే. కానీ అవి నెరవేరేలా లేవు.

పీకీ ఇచ్చిన నివేదిక చూస్తే కేసీఆర్ మది దిమ్మదిరిగిపోతోంది. మంత్రుల్లో చాలా మంది స్థానాలు గల్లంతయ్యే అవకాశం ఏర్పడింది. చాలా చోట్ల పార్టీ కష్టాల్లో పడింది. ఎమ్మెల్యేలపై కూడా వ్యతిరేకత మామూలుగా లేదు. దీంతో మూడోసారి అధికారం కలగానే మిగిలిపోతోందనే బాధ టీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతోంది. ముంచుకొస్తున్న ముప్పును తప్పించుకోవడం ఎలా అనే దానిపైనే మల్లగుళ్లాలు పడుతున్నారు. పార్టీ పరంగా నేతలంతా బలహీనంగా ఉన్నారని తెలుస్తోంది. దీంతో గెలుపు అంత సునాయాసం కాదనే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీని ఎలా గాడిలో పెట్టాలనే దానిపై కేసీఆర్ పలు రకాల ఆలోచనలు చేస్తున్నారు. ఏవి వర్కవుట్ అవుతాయనే దానిపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం.
Also Read:Revanth Reddy: రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం.. నీళ్లలో నిండా మునిగింది.!
[…] Also Read: CM KCR: కేసీఆర్ రెండు నాల్కల ధోరణి ఇక మారద… […]