Homeజాతీయ వార్తలువాహ్‌.. ఏం స్కెచ్‌ : ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం మర్డర్లు

వాహ్‌.. ఏం స్కెచ్‌ : ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం మర్డర్లు

murders
చరిత్రలో కనీవినీ ఎరగని ఉదాంతం ఇది. కేవలం ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం మర్డర్లు చేయడం అంటే ఒక్క ఈ ఘటనలనే చూస్తున్నాం కావచ్చు. ఈ ఉదంతంలో మానవత్వం మచ్చుకైనా కనిపించలేదు. అది ఎలా ఉంటే.. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న వారిని నిశితంగా పరిశీలిస్తాడు. వారిని చేరదీస్తాడు. చివరికి వారు మరో రకంగా చనిపోతూ ఉంటారు. చివరికి తేలే విషయం ఏమిటంటే.. వారిని చేరదీసే వ్యక్తి వారి పేరుపై పెద్ద ఎత్తున ఇన్సూరెన్స్‌లు చేసి సరైన సమయంలో చంపేసి.. క్లెయిమ్‌లు చేసుకుంటూ ఉంటాడు. ఇది ఫ్లాపైన ఓ సినిమాలోని కథ. సినిమా ఫ్లాపేమో కానీ.. కథ.. కథలోని ప్లాట్ బాగా నచ్చిందనుకున్నారేమో కానీ.. నల్లగొండ జిల్లాలోని ఓ ముఠా దీన్నే అమలు చేసేసింది.

Also Read: ఎమ్మెల్సీ రంగంలోకి కేసీఆర్‌‌ : వినూత్న ప్రచారం

ఏకంగా ఐదారుగుర్ని చంపేసి రూ.కోట్లు క్లెయిమ్ చేసుకుని దొరికిపోయింది. ఇప్పుడీ వ్యవహారం సంచలనం అయింది. నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు బీమా ఏజెంట్లు, మరో ఇద్దరు కరుడు గట్టిన క్రిమినల్స్ ముఠాగా ఏర్పడ్డారు. వారు మరుమూల ప్రాంతాల్లో అనారోగ్యంతో ఉన్న వారిని గుర్తించి.. వారి కుటుంబసభ్యులను ఒప్పించి బీమాలు చేయించడం ప్రారంభించారు. అలా చేయించడానికి ముందే కుటుంబసభ్యులతో ఒప్పందం చేసుకుంటారు. క్లెయిమ్ చేసే సొమ్ములో 20 శాతం మాత్రమే ఇస్తామని.. మిగతా మొత్తం తమదేనని ఆ ఒప్పందం సారాంశం. అనారోగ్యంతో మృతి చెందే వారికి క్లెయిమ్ రాదు కాబట్టి చనిపోబోయే వ్యక్తిని చంపేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిద్దామని వారు ఒప్పందం చేసుకుంటారు. డబ్బు కోసం బీమా చేయించే వ్యక్తి కుటుంబసభ్యులు కూడా అంగీకరించడంతో వారు ప్లాన్ అమలుచేస్తారు.

ఇలా ఖమ్మం, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో ఐదారుగురిని చంపేసి బీమా క్లెయిమ్ చేసుకున్నారు. ఈ ప్రక్రియ మొత్తంలో ఎవరికీ అనుమానం రాకుండా.. బీమా కంపెనీ సిబ్బందితో పాటు బ్యాంకు వారిని కూడా మచ్చిక చేసుకున్నారు. వారికి తృణమో.. పణమో అప్పజెప్పారు. అందరూ కలిసి ముఠాగా ఏర్పడి ఈ దందాకు తెరలేపారు. అంతా సాఫీగా సాగిపోతోందని అనుకుంటున్న సమయంలో ఓ హత్య విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Also Read: హరీశ్‌కు ఎమ్మెల్సీ బాధ్యతల వెనుక ఉన్న ఆంతర్యం అదేనా

కోటిరెడ్డి అనే వ్యక్తిని హతమార్చి ట్రాక్టర్ ప్రమాదం కింద చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ.. పోస్టుమార్టంలో కోటిరెడ్డికి బలమైన గాయాలున్నట్లుగా తేలడంతో పోలీసులు విచారణ జరిపించారు. చివరికి తీగలాగడంతో బీమా ఏజెంట్ గురించి విషయం వెలుగుచూసింది. దీంతో కథ అంతా బయటకు వచ్చింది. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఎప్పటికైనా చనిపోతాడు కాబట్టి అతన్ని ముందే చంపేసి బీమా క్లెయిమ్ చేసుకోవడం ఈ ముఠా పని. డబ్బు కోసం మానవ సంబంధాలు విడిచిపెట్టిన కుటుంబసభ్యులదీ ఇందులో భాగస్వామ్యం.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

2 COMMENTS

Comments are closed.

RELATED ARTICLES

Most Popular