spot_img
Homeఆంధ్రప్రదేశ్‌తామే గెలిచామంటూ ఈ పోటాపోటీ ప్రకటనలెందుకో..? : ముందుంది మున్సిపల్‌ పోరు

తామే గెలిచామంటూ ఈ పోటాపోటీ ప్రకటనలెందుకో..? : ముందుంది మున్సిపల్‌ పోరు

Municipal Elections
ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. నాలుగు విడతల్లో నిర్వహించిన పోలింగ్‌.. నిన్నటితో ముగిసింది. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం.. ఎన్నికలు పార్టీలకతీతం. అయితే.. ఏపీలో పొలిటికల్ సూపర్ యాక్టివిజం ఉంది. ఈ కారణంగా మైనర్ గ్రామాల్లోనూ పార్టీలున్నాయి. గ్రూపులున్నాయి. దీంతో పార్టీ సానుభూతి పరుల వారీగానే ఎన్నికలు జరిగాయి. లోకల్ క్యాడర్ స్ట్రెంత్‌ను పంచాయతీ ఎన్నికలు బలోపేతం చేస్తాయి. అందుకే ఏపీలో అధికార, విపక్ష పార్టీలు పంచాయతీ ఎన్నికల్లో పూర్తిస్థాయి రాజకీయం చేసేశాయి.

Also Read: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీ కూతురు వాణిదేవి : కేసీఆర్‌‌ వ్యూహం అదేనా

ఓ వైపు పార్టీలతో సంబంధం లేకున్నా.. కౌంటింగ్ ప్రారంభం కాక ముందే గెలుపు తమదంటే తమదని చెప్పుకోవడం ప్రారంభించాయి. ఎవరు ఉధృతంగా ప్రచారం చేసుకుంటే వారిదే విజయమన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు పోను నాలుగు విడుతల్లోనూ దాదాపుగా 11 వేల పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 3 వేల పైచిలుకు పంచాయతీల ఓటర్లు తాము ఓటు హక్కు వినియోగించుకోకుండా ఏకగ్రీవం చేసుకున్నారు. ఈ 11 వేల పంచాయతీల్లో తమ ఊరు బాగు కోసం ఎవరు ఉపయోగపడతారో ప్రజలు వారినే ఎన్నుకున్నారు.

ఈ పంచాయతీ ఎన్నికల్లో పూర్తి ఫైనల్‌ డెసిషన్‌ ప్రజలదే. వారు ఎవరిని అనుకుంటే వారినే ఎన్నుకుంటారు. అందుకు పార్టీతో సంబంధం కూడా ఏమీ ఉండదు. ఈ విషయాన్ని టీడీపీ, వైసీపీలు రెండూ గుర్తించాయి. అందుకే.. నిజంగా గ్రౌండ్‌లో ఎంత గెలుస్తామన్న దాని కన్నా ప్రచారం మాత్రం పీక్స్‌లో ఉండేలా చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. పంచాయతీ కిరీటం తమదంటే తమదని ప్రచారం చేసుకున్నారు. ఎవరైనా ముఖ్య నేత స్వగ్రామంలో ఓడిపోతే పండుగ చేసుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారిందని తేల్చేస్తున్నారు.

Also Read: మరో ప్రాంతాన్ని చేజిక్కించుకుంటున్న బీజేపీ: పుదుచ్చేరిలో కూలిన కాంగ్రెస్ ప్రభుత్వం..

వచ్చే నెలల మున్సిపల్‌ పోరు ప్రారంభం కానుంది. ఈ ఎన్నికలు పూర్తిగా పార్టీ గుర్తులతోనే ఉంటాయి. వచ్చే నెల పదో తేదీన పోలింగ్ జరగనుంది. 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. 14న ఫలితాలు వెల్లడవుతాయి. నిజానికి ఇప్పుడు గెలుపెవరిదో వారు ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలే బ్యాలెట్ తీర్పు ద్వారా వెల్లడిస్తారు. కానీ.. అప్పటి వరకూ ఆగకుండా పంచాయతీల్లోనే గెలిచేశామని రెండు పార్టీల నేతలు సంబరపడిపోతున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Thammineni Seetharam

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...
Chennai Love Story Movie

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను రామ్ చరణ్ చేశాడుగా…

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్... 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తర్వాత చేసిన 'గోకులంలో సీత'...
YSRCP

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....
Perni Nani

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...
Oktelugu Epaper