ఒక వంక ఉన్న కొద్దిపాటి ఆదాయం కరోనాతో కరిగి పోతుండటం, మరోవంక అదనపు ఆర్ధిక వనరుల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించక పోవడం, కేంద్రం ఆదుకొంటుంది అనుకొంటే రిక్త హస్తం ఎదురవుతూ ఉండడం, అప్పులు కూడా పుట్టాక పోతూ ఉండడంతో ప్రభుత్వం నడవాలి అంటే జనంపై విచ్చలవిడిగా పన్నుల భారం మోపడమే మార్గంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
అందుకనే ఇప్పటికే ఉన్న పన్నులను పెంచడంతో పాటు, ఇప్పటి వరకు ఊహించని విధంగా కొత్త పన్నులు వేయడానికి ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. రూ 5,000 నుండి రూ 10,000 వరకు వేతనం తీసుకురటున్న వారిపై ఇక నెలకు రూ 50 చొప్పున ఏటా రూ 600 పన్ను భారం వేయనున్నారు. ఇక రూ 10,000 నుండి రూ 15,000 వరకు జీతాలున్న వారిపై ఏడాదికి రూ 1200 భారం పడనుంది. ప్రస్తుతం రూ.1250 వృత్తి పన్ను పరిధిలో ఉన్న వారి నురచి ఇకపై రూ.2,500 వసూలు చేయాలని కూడా చూస్తున్నారు. అంటే వృత్తిపన్ను 100 శాతం పెరగనుంది.
స్వల్ప జీతంతో పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రయివేటు కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, చివరకు ఆటో, టాక్సీ డ్రైవర్లపైనా పన్ను భారం పడనుంది. ఈ మేరకు వృత్తి పన్ను చట్టాన్ని అవసరమైన మేరకు సవరిరచాలని చూస్తున్నారు. ఇటీవలే కీలక శాఖల అధికారులతో భేటీ అయిన ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖల అధికారులు వీటికి సంబందించిన పలు అరశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేసారు.
రవాణా శాఖకు సంబంధిరచి ఆటోలు, టాక్సీలు, మిని క్యాబ్‌లు రాష్ట్రంలో 95,000 వరకు ఉన్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు సంబందించి చిట్ ఫండ్ సంస్థలలో పనిచేసే వారిని కూడా పన్ను పరిధిలోకి తీసుకురావాలని చూస్తున్నారు. ప్రస్తుతం రిజిస్టర్ అయిన చిట్‌ఫండ్ సంస్థలు 717, చిన్న గ్రూపులు 12,328, వాటిల్లో ఉన్న వారు దాదాపు ఐదు లక్షల మంది ఉండగా, తద్వారా ఏటా రూ.765 కోట్ల వ్యాపారం జరుగుతున్నట్లు అంచనా వేశారు.
ఆర్‌టిసికి సంబంధిరచి అద్దె బస్సుల్లో ఎక్కువ మంది డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. వారికి రూ.12 వేలు వేతనంగా చెల్లిస్తున్నారు. ఇదే సమయంలో అనేక బస్టాండ్లలో వందల సంఖ్యలో దుకాణాలు కూడా ఉన్నాయి. అవి కూడా త్వరలో పన్ను పరిధిలోకి వచ్చే అవకాశాలున్నాయి. పాఠశాల, ఇంటర్ విద్యాశాఖలకు చెందిన ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సిరగ్ విధానంతో దాదాపు 1.15 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.
ఏదో రకంగా వీరందరిని పన్ను పరిధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా కసరత్తు సాగుతోంది. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో వేలాదిమందిని కూడా పన్ను పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. ఇదే సమయంలో అబ్కారీ, గనులు, చలనచిత్ర పరిశ్రమ వంటి అనేక ఇతర శాఖల్లోనూ పన్ను పరిధిలోకి రాని వారిని ఇప్పుడు పన్ను పరిధిలోకి తీసుకురానున్నారు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: More tax burdens on the ap people
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com