Prabhas- Minister Roja: పెదనాన్న కృష్ణంరాజు మరణంతో ఆయన సొంతూరు మొగల్తూరులో సంస్మరణ సభను అభిమానుల కోసం ఏర్పాటు చేయించాడు ప్రభాస్. ఇందుకోసం హైదరాబాద్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు వచ్చారు. కృష్ణంరాజు, ప్రభాస్ ల సొంత గ్రామం మొగల్తూరులో ప్రభాస్ సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ప్రజలు, అభిమానులకు మటన్, చికెన్ సహా విందుభోజనం ఏర్పాటు చేయించారు. దాదాపు 70వేల మంది ప్రజలకు సరిపడా ఈ భారీ విందును ఏర్పాటు చేయించి ప్రభాస్ తన ఉదారత చాటుకున్నారు.

ఈ భారీ విందు కోసం.. కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం.. ప్రభాస్ ను చూడడానికి గోదావరి జిల్లాల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ప్రభాస్ ఇంటి వద్ద సందడి నెలకొంది. ఈ క్రమంలోనే అంతపెద్ద భారీ ఈవెంట్ కోసం వచ్చిన ప్రభాస్ ను కలవడానికి ఏపీ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తరలివచ్చారు. లోకల్ భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సైతం ప్రభాస్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం ఏపీ ప్రభుత్వం తరపున మంత్రులు రోజా, కారుమూరు నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ… కృష్ణంరాజు మరణంతో రాష్ట్ర ప్రజలందరూ దిగ్భ్రాంతికి గురయ్యారని అన్నారు. ఆయన మరణం సినీ, రాజకీయ రంగాలకు తీరని లోటు అని చెప్పారు. కృష్ణంరాజు స్మృతివనం ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తుందని… రెండెకరాల స్థలాన్ని కేటాయిస్తుందని… ఇదే విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలిపామని వెల్లడించారు.

మంత్రులంతా కలిసిన తర్వాత హీరో ప్రభాస్ తో సినీ ఇండస్ట్రీకే చెందిన మంత్రి ఆర్కే రోజా సీక్రెట్ మీటింగ్ నిర్వహించడం విశేషం. ఈ మీటింగ్ లో కేవలం సినీ ఇండస్ట్రీ పాత విషయాలు మాట్లాడుకున్నారని కొందరు అంటుండగా.. జగన్ చెప్పిన వర్తమానాన్ని రోజా ప్రభాస్ కు చెప్పారని మరికొందరు అంటున్నారు. మరి ఈ సీక్రెట్ మీటింగ్ కేవలం సినిమాల పరంగానా? రాజకీయమా? అన్నది తేలాల్సి ఉంది. ప్రభాస్ తో రోజాకు ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఈ మీటింగ్ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మరింది.
Also Read: Rajasthan Political Crisis: రాజస్థాన్ సంక్షోభం: కాంగ్రెస్ కు షాకిచ్చిన అశోక్ గెహ్లాట్
[…] Also Read: Prabhas- Minister Roja: మొగల్తూరులో హీరో ప్రభాస్ తో … […]