500 KG Cake Viral Video: ఏదైనా ఫ్రీ గా వస్తుందంటే.. వెంటనే దానిని దక్కించుకోవడానికి పోరాటాలు చేస్తుంటారు. అది వస్తువైనా.. ఆహార పదార్థమైనా.. సాధారణంగా బర్త్ డే జరిగినప్పుడు కేక్ కట్ చేస్తే మహా అయితే రెండు పీసీసె తింటారు. అప్పటికే దానిపై బోర్ కొడుతుంది. కానీ కిలల కొద్దీ కేకేను ఎవరైనా తింటారా..? కానీ ఓ గ్రామంలో ఊరికే కేకు దొరికిందని అందినకాడికి ఎత్తుకెళ్లారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.
కర్నూలు జిల్లాలో ఓ రాజకీయ నాయకుడి పుట్టినరోజు వేడుకలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. భారీ ఎత్తున నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా 500 కిలోల భారీ కేక్ ను తయారు చేశారు. వందలాది మంది కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేయగా, ఆ తరువాత జరిగిన ఘటన ప్రస్తుతం ఎక్స్ (ట్విట్టర్) సహా ఇతర సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతోంది.
కేక్ కట్ చేసిన వెంటనే అక్కడ ఉన్న కార్యకర్తలు, అభిమానులు ఒక్కసారిగా కేక్ వైపు దూసుకెళ్లారు. ఎవరికి వారు ఎక్కువ భాగం తీసుకెళ్లాలని పోటీ పడటంతో కేవలం రెండు నిమిషాల్లోనే 500 కిలోల కేక్ పూర్తిగా ఖాళీ అయిపోయింది. కొందరు చేతులతో, మరికొందరు ప్లేట్లు, కవర్లు, బాక్సుల్లో కేక్ తీసుకెళ్లిన దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. “ఇంత కక్కుర్తి ఎందుకు..?”, ‘అందరికీ సరిపడేలా పంచుకుని తీసుకుంటే బాగుండేది కదా..’ అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మరికొందరు ‘కక్కుర్తిలో కమండలం’, ‘కేక్ కోసం క్యూ కాదు… యుద్ధమే జరిగింది’, ‘రెండు నిమిషాల్లో 500 కిలోలు మాయం.. ఇదే స్పీడ్ అంటే!’, అంటూ మీమ్స్, ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి.
కొంతమంది మాత్రం దీనిని అభిమానుల ఉత్సాహంగా అభివర్ణిస్తున్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరుకావడం వల్లే కేక్ వేగంగా అయిపోయిందని, ఇందులో తప్పు ఏమీ లేదని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు, ఇలాంటి కార్యక్రమాల్లో క్రమబద్ధంగా పంపిణీ చేస్తే ఇలాంటి తొక్కిసలాట తరహా పరిస్థితులు ఉండవని మరికొందరు సూచిస్తున్నారు.
ఇది జరిగింది కర్నూలు లో
ఇట్లాంటి జనాలు ఉన్నంత వరకు లీడర్స్ హ్యాపీఇంత కక్కుర్తి ఎందుకు ఫ్రీ అని
Video: kurnool_insights @HiHyderabad @ApnaSecbad pic.twitter.com/UyPsGvVxcR— Savoir Vivre (@InterferonEi) August 6, 2026