Chandrababu: ఏ రాజకీయ నాయకుడికైనా ప్రతికూలతలు ఉంటాయి.. అనుకూలతలు ఉంటాయి. కానీ కొందరు విషయంలో మాత్రం భిన్నప్రచారం జరుగుతూ ఉంటుంది. చంద్రబాబు విషయంలో ఇదే మాదిరిగా జరిగింది. ఆయనపై ఎంతలా వ్యతిరేకత ముద్రవేశారో తెలియనిది కాదు. కానీ ఇప్పుడు ఆయన విషయంలో ప్రజల మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ చరిత్ర ఆయనది. మరో రెండేళ్లలో 50 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తి చేసుకుంటారు. అయితే ఆయనపై ఎనలేని ప్రేమాభిమానాలు పెంచుకున్న వారు ఉంటున్నారు. ఆ జాబితాలో వయోవృద్ధులు కూడా ఉండడం విశేషం. 9 పదులు దాటిన వృద్ధతరం సైతం చంద్రబాబుతో మాట్లాడాలని.. ఆయనతో ఫోటో దిగాలని కోరుకోవడం చూస్తుంటే మాత్రం నిజంగా గొప్ప విషయం. మొన్న మధ్యన తూర్పుగోదావరి జిల్లాలో ఒక వయోవృద్ధుడు అలానే చంద్రబాబును చూసి మురిసిపోయారు. తాజాగా చీరాలలో 90 సంవత్సరాలు పైబడిన వృద్ధురాలు చంద్రబాబును కలిసి ఆయనపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
* అప్పట్లో సత్యనారాయణ అనే వృద్ధుడు..
కొద్దిరోజుల కిందట చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని పర్యటనకు వెళ్లారు. కామధేనువు లంక గ్రామానికి చెందిన ఓ 96 ఏళ్ల వృద్ధుడు సానబోయిన సత్యనారాయణ చంద్రబాబును కలవాలన్న ఆకాంక్షను బయటపెట్టాడు ఓ సోషల్ మీడియా వీడియో ద్వారా. చంద్రబాబు ఆ విషయాన్ని తెలుసుకొని స్వయంగా తన పర్యటనలో సత్యనారాయణ ను పిలిపించుకున్నారు. చాలా ఆప్యాయంగా మాట్లాడారు. తాను ఎంతగానో అభిమానించే నాయకుడు కలిసే సరికి సత్యనారాయణ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అప్పట్లో ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది కూడా.
* 90 ఏళ్ల వృద్ధురాలితో..
అయితే తాజాగా చీరాల పర్యటనకు వెళ్లారు చంద్రబాబు. జాతీయ చేనేత దినోత్సవానికి హాజరయ్యారు. ఆ ప్రాంతానికి చెందిన పుష్పావతి అనే 90 సంవత్సరాల వృద్ధురాలు చంద్రబాబును కలిసి ఫోటో దిగాలన్న ఆకాంక్షను బయటపెట్టింది. ఆమె విజ్ఞప్తి సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు వరకు వెళ్ళింది. దీంతో చీరాలలో కలిసి మాట్లాడతాను అంటూ సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు చంద్రబాబు. చీరాల పర్యటనలో ఆమెను పిలిపించుకుని మాట్లాడారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆమెతో సైతం ఫోటో దిగారు. కొద్దిసేపు వారి మధ్య ఆరోగ్యకరమైన చర్చ నడిచింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వైరల్ అవుతోంది. అయితే తనకు మించి వయసున్న వయోవృద్ధులు సైతం.. చంద్రబాబు అభిమానులుగా మారుతుండడం మాత్రం ఆకట్టుకుంటోంది.
View this post on Instagram