Krishnam Raju Samsmarana Sabha Dishes: టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణం రాజు సంస్మరణ సభ మొగల్తూరులో ఘనంగా నిర్వహించారు. కృష్ణంరాజు తమ్ముడి కొడుకు ప్రభాస్ అభిమానుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. వారికి ఏ లోటు రాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. కృష్ణంరాజు సొంతూరు ఏలూరు జిల్లా మొగల్తూరు కావడంతో అక్కడే సంస్మరణ సభ నిర్వహించేందుకు ప్రభాస్ అక్కడే ఏర్పాట్లు చేయాలని భావించారు. దీంతో సభకు వచ్చే అతిథుల కోసం ఏ ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు. ఎంత మంది వచ్చినా ఎలాంటి సమస్య రాకుండా ఉండాలని చూశారు. ఈ మేరకు రకరకాల వంటకాలు రెడీ చేయించారు. నోరూరుంచే వంటకాలు సిద్ధం చేయించారు.

కృష్ణంరాజుది క్షత్రియుల కుటుంబం కావడంతో సహజంగానే ఎక్కువ మంది రావడం సహజమే. అందుకే వారికి అన్ని రకాల వంటలు తయారు చేయించారు. దాదాపు డెబ్బయి వేల మంది తినడానికి భోజనాలు తయారు చేయించారు. అతిథులు తినేందుకు అన్ని రకాల కూరలు వండించారు. మటన్, చికెన్, రొయ్యలు, పీతలు అన్ని రకాల వంటకాలు చేయించి తన ప్రత్యేకత చాటుకున్నారు.
Also Read: Prabhas- Minister Roja: మొగల్తూరులో హీరో ప్రభాస్ తో మంత్రి రోజా సీక్రెట్ మీటింగ్
ఆరు టన్నుల మటన్ కర్రీ, ఆరు టన్నుల మటన్ బిర్యానీ, ఆరు టన్నుల చికెన్ బిర్యానీ, టన్ను బొమ్మిడాల పులుసు, టన్ను రొయ్యల ఇగురు, రెండు లక్షల బూరెలు దాదాపు ఇరవై రకాల స్పెషల్స్ చేయించి తమ ప్రత్యేకత చాటుకోవడం విశేషం. దీంతో వచ్చిన వారికి ఏది కావాలంటే అది వడ్డించారు. దీంతో వచ్చిన వారు రాజు ఎక్కడున్నా రాజేరా అని ప్రశంసించారు. ప్రభాస్ అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేశారు. దీంతో మొగల్తూరు మొత్తం జనంతో నిండిపోయింది. కృష్ణం రాజు సంస్మరణ సభ సందడిగా మారింది.

తెలుగు చిత్ర పరిశ్రమలో రారాజుగా వెలిగిన కృష్ణంరాజు సేవలను పలువురు పొగిడారు. సినిమా రంగంలోనే కాకుండా రాజకీయాల్లో సైతం ఆయన తనదైన శైలిలో రాణించారు కేంద్ర మంత్రిగా పనిచేసి పలువురికి సేవలందించారు. అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలో ఆయన కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మొగల్తూరు బిడ్డ ఢిల్లీ స్థాయిలో చక్రం తింపి తన స్థాయి పెంచుకున్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిది. మకుటం లేని మహారాజుగా ఆయన వ్యవహరించిన తీరుకు అందరు మంత్రముగ్దులవుతుంటారు. దీంతో వచ్చిన వారు ఆయన సేవలను వేనోళ్ల పొగిడారు.
[…] Also Read: Krishnam Raju Samsmarana Sabha Dishes: ప్రభాస్.. ‘రాజు ఎక్కడున… […]