Prabhas- YCP MLA Grandhi Srinivas: ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటారు. అయితే ఇంట గెలవడానికి ఇప్పటికే ఇద్దరు ప్రయత్నించి విఫలమయ్యారు. రాజకీయంగా ఓడిపోయారు. ఇప్పుడు ప్రభాస్ వంతు వచ్చింది. మరి ప్రభాస్ గెలుస్తాడా? లేడా? అన్నది హాట్ టాపిక్ గా మారింది. కృష్ణంరాజు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్ సహా ఎంతో మంది నటీనటుల పుట్టినిల్లు ‘మొగల్తూరు’. ఈ మొగల్తూరు ఉన్న భీమవరం నియోజకవర్గం నుంచి ఇదివరకూ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు పోటీచేశారు. కానీ గెలవలేకపోయారు. ఇప్పుడు ప్రభాస్ పోటీచేయాలని.. వైసీపీ తరుఫున నిలబడితే గెలిపిస్తామని స్థానిక వైసీపీ ఎమ్మెల్యే స్వయంగా ప్రతిపాదించినట్టు సమాచారం.

తాజాగా పెదనాన్న కృష్ణంరాజు మరణంతో ఆయన సొంతూరు మొగల్తూరులో సంస్మరణ సభను అభిమానుల కోసం ఏర్పాటు చేయించాడు ప్రభాస్. ఇందుకోసం హైదరాబాద్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు వచ్చారు. కృష్ణంరాజు, ప్రభాస్ ల సొంత గ్రామం మొగల్తూరులో ప్రభాస్ సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ప్రజలు, అభిమానులకు మటన్, చికెన్ సహా విందుభోజనం ఏర్పాటు చేయించారు. దాదాపు 70వేల మంది ప్రజలకు సరిపడా ఈ భారీ విందును ఏర్పాటు చేయించి ప్రభాస్ తన ఉదారత చాటుకున్నారు.
Also Read: Rajasthan Political Crisis: రాజస్థాన్ సంక్షోభం: కాంగ్రెస్ కు షాకిచ్చిన అశోక్ గెహ్లాట్
ఈ భారీ విందు కోసం.. కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం.. ప్రభాస్ ను చూడడానికి గోదావరి జిల్లాల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ప్రభాస్ ఇంటి వద్ద సందడి నెలకొంది. ఈ క్రమంలోనే అంతపెద్ద భారీ ఈవెంట్ కోసం వచ్చిన ప్రభాస్ ను లోకల్ భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కలిశారు. సంస్మరణ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రభాస్ తో కలిసి కీలక భేటి నిర్వహించి ప్రభుత్వ పరంగా సాయం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రభాస్ ఏకంగా లక్షమందికి పైగా భోజనాలు ఏర్పాటు చేసి మొగల్తూరు సహా భీమవరం ప్రజలను ఖుషీ చేయడంతో భీమవరం నుంచి ప్రభాస్ పోటీచేస్తే తాను తప్పుకుంటానని.. వైసీపీతో తరుఫున గెలిపిస్తామని స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రతిపాదించినట్టు ప్రచారం సాగుతోంది. ఈ మేరకు ప్రభాస్ తో భేటిలో చెప్పుకొచ్చాడని.. ప్రభాస్ మాత్రం నవ్వి ఊరుకున్నాడని సమాచారం. ప్యాన్ ఇండియా స్టార్ గా ఉన్న ప్రభాస్ కు రాజకీయాలంటే అస్సలు పడదు. అందుకే వైసీపీ ఎమ్మెల్యే ప్రతిపాదనకు ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోయినట్టు సమాచారం.
Also Read: Jasprit Bumrah: ప్రపంచకప్ ముందుర భారత్ కు భారీ షాక్.. ఆ కీలక ప్లేయర్ గాయంతో ఔట్
[…] Also Read: Prabhas- YCP MLA Grandhi Srinivas: మొగల్తూరు నుంచి ప్రభాస్… […]