spot_img
Homeఆంధ్రప్రదేశ్‌జగన్ కు నువ్వు సవాల్ ఏంట్రా బఫూన్.. లోకేష్ పై కొడాలి నాని ఫైర్

జగన్ కు నువ్వు సవాల్ ఏంట్రా బఫూన్.. లోకేష్ పై కొడాలి నాని ఫైర్

Kodali Nani
ఏపీ రాజకీయాలు ఇప్పడు రామతీర్థం దేవస్థానం చుట్టూరా తిరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అంతేకాదు.. ఒకరి తర్వాత ఒకరు రామతీర్థం ఆలయాన్ని సందర్శిస్తూ రాజకీయాలను మరింత హీటెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం స్పందించారు. మరోవైపు.. బీజేపీ నేతలు కూడా ఫైర్‌‌ అయ్యారు.

Also Read: రెండు వ్యాక్సిన్లకు డీసీజీఐ అనుమతి.. కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని..!

అయితే.. తాజాగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘రామతీర్థంలో నూటికి నూరుశాతం విగ్రహాన్ని ధ్వంసం చేయించింది చంద్రబాబే. చంద్రబాబుతో పాటుగా, లోకేష్, అశోక్ గజపతిరాజు, స్థానిక టీడీపీ నాయకులకు నార్కో ఎనాలసిస్ పరీక్షలు చేయిస్తే నిజాలు బయట పడతాయి. పదవుల కోసం గుళ్లు, మసీదులు, చర్చిలు, తిరిగే చంద్రబాబు దేవుళ్ల గురించి మాట్లాడడం ఆశ్చర్యం. దేవుడులాంటి ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు, దేవుడు అన్నా, ప్రజాస్వామ్యం అన్నా నమ్మకం లేదు. స్వార్థ రాజకీయాల కోసమే విజయనగరం జిల్లా రామతీర్థంలో చంద్రబాబు డేరా బాబా అవతారం ఎత్తారు. రాజకీయాల్లో దేవుళ్లను అడ్డంపెట్టుకుని బతికే నీచ స్థితికి చంద్రబాబు దిగజారారు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో గుళ్లను కూల్చి, చెత్త ట్రాక్టర్లలో దేవుళ్ల విగ్రహాలను డంపింగ్ యార్డ్‌ల్లో పడేసిన చరిత్ర చంద్రబాబుది. చంద్రబాబు ఆధ్వర్యంలోని అతని అనుచరులు అధీనంలో ఉన్న గుళ్ళు, ఊరికి దూరంగా ఉన్న గుళ్లలో దాడులు జరుగుతున్నాయి’ అని నాని విమర్శలు గుప్పించారు.

Also Read: ఎన్ని అడ్డంకులొచ్చినా దీక్ష కొనసాగిస్తాం..: కోదండరాం

‘అధికారంలో ఉన్నప్పుడు పగలు, లేనప్పుడు రాత్రివేళల్లో దేవాలయాలపై చంద్రబాబు దాడులు చేస్తున్నారు. భగవంతుడంటే నమ్మకం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రామతీర్థం ఘటనపై నీతి, నిజాయితీగా విచారణ చేసి దోషులను పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. విచారణలో చంద్రబాబు దోషిగా ఉన్నా.. లేదా..? అతని తండ్రి ఖర్జూర నాయుడు ఉన్నా, తాత కిస్మిస్ నాయుడు ఉన్నా కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవనీ చవట, దద్దమ్మ లోకేష్.. ముఖ్యమంత్రి జగన్‌కు ఛాలెంజ్ విసరడం విడ్డూరం’ అని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Oppo A7 Pro Max

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు...
SJP Protests

SJP Protests: సీజేపీ వెంట పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా.. షాకిచ్చిన పోలీసులు

SJP Protests: ఢిల్లీలో కాక్‌రోచ్‌ జంతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో నడుస్తున్న విద్యార్థి ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది....
High Protein Breakfast

High Protein Breakfast: ఉదయం, సాయంత్రం ఈ పదార్థం తింటే రుచితో పాటు ప్రోటీన్స్.. ఎలా తయారు చేయాలంటే..

High Protein Breakfast: ప్రస్తుత కాలంలో చాలామంది ఆరోగ్యకరమైన లేదా పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలని అనుకుంటున్నారు. అయితే అధికంగా ప్రోటీన్లు ఇచ్చే పదార్థాలు అధిక ఖర్చుతో కూడుకొని ఉన్నాయి....
Allu Arjun

Allu Arjun: చిరంజీవి తో కలిసి రాజకీయాల్లోకి అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్...

Allu Arjun: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే ఊహాగానాలు ఏ రేంజ్ లో ప్రచారం అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన మామయ్య...
Jana Nayagan First Day Collection

Jana Nayagan First Day Collection: ‘జన నాయగన్ ‘ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ట్రేడ్...

Jana Nayagan First Day Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో...
Oktelugu Epaper