Maharashtra land purchase scam: మహారాష్ట్రలో 1800 కోట్ల భూకుంభకోణం దేశ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ రాష్ట్రంలో బిజెపి ఆధ్వర్యంలోని కూటమి అధికారంలో ఉంది. మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ కొనసాగుతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ వున్నారు. అజిత్ పవార్ మహారాష్ట్ర ప్రభుత్వంలో కీలక శాఖలను పర్యవేక్షిస్తున్నారు. అజిత్ పవార్ కు సంబంధించిన పార్థ కంపెనీకి 1800 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టింది మహారాష్ట్ర ప్రభుత్వం.. ఇంతటి విలువైన కోట్ల భూమిని 300 కోట్లకే కట్టబెట్టడం అనుమానాలకు తావిస్తోంది.
ఈ వ్యవహారంపై అక్కడ ప్రతిపక్షాలకు కూడా తెలియదు. అయితే ఇంతటి కుంభకోణాన్ని దిన్కర్ కోట్కర్ అనే వ్యక్తి బయటపెట్టారు. ఈ వ్యవహారంపై ఐజిఆర్ ఆఫీస్ కి లేఖ రాశారు. లేఖ రాసినప్పటికీ ఎటువంటి స్పందన రాలేదు.. అయితే ఈ లేఖను ఓ సామాజిక కార్యకర్త తీసుకున్నారు. రికార్డులను మొత్తం టెంపర్ చేసినట్టు ఆయన గుర్తించారు.. ఆ తర్వాత అనేక విధాలుగా ఆయన పలు ప్రభుత్వ శాఖలను సంప్రదించారు. మీడియాలో కూడా పెద్ద ఎత్తున కథనాలు రావడంతో అధికారులు స్పందించక లేదు. దీంతో అధికారులు విచారణ సాగించారు. చివరికి 1800 కోట్ల విలువైన భూ కుంభకోణం జరిగిందని తేల్చారు. దీంతో ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు రావడంతో రిజిస్ట్రేషన్ మొత్తం రద్దు చేసింది.
భూ వ్యవహారం ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో మహారాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా డిఫెన్స్ లో పడిపోయింది. 60 సంవత్సరాల దిన్ కర్ వ్యక్తి చేసిన పోరాటం వల్ల మహారాష్ట్ర డిప్యూటీ సీఎం భూ బాగోతం బయటపడింది. ఈ వ్యవహారం మీడియాలో పడి పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ప్రభుత్వానికి తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే ఆదునుగా అక్కడి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ రెచ్చిపోవడం మొదలుపెట్టింది.. ఆధారాలతో సహా ఈ కుంభకోణాన్ని మరింత వెలుగులోకి తెచ్చింది. దీంతో అజిత్ పవార్ తలవంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. మొత్తానికి 60 సంవత్సరాల వ్యక్తి 1800 కోట్ల విలువైన భూ కుంభకోణాన్ని వెలుగులోకి తేవడంతో.. మహారాష్ట్ర ప్రభుత్వం తల వంపులకు గురైంది. మీడియా చేయలేనిది.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వల్ల కానిది.. ఒక వ్యక్తి చేసి చూపించాడు..