Bigg Boss 9 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో కంటెస్టెంట్స్ చాలా వరకు కన్నింగ్ గా, ఫేక్ గా ఉంటున్నారని సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి బలంగా వినిపిస్తున్న మాట. ఎందుకంటే అందరూ డ్రామాలు చేస్తున్నారు. హౌస్ లో అందరికీ తనూజ నే టాప్ లో ఉంది అనే విషయం అర్థం అయిపోయింది. దీంతో ఆమెని టార్గెట్ చేస్తే, ఆమెని ద్వేషించే వాళ్ళు తమకు ఓట్లు వేస్తారని కొందరు ఆమెని కావాలని టార్గెట్ చేయడం, కనీసం నామినేషన్స్ నుండి అయినా సేవ్ అవుదాం అనే ఉద్దేశ్యంతో ఆమెతో మంచిగా ఉండే ప్రయత్నం చేసే చేస్తారని కొందరు, తెగ డ్రామాలు చేస్తున్నారు. ముఖ్యంగా దివ్య అయితే తనూజ తో తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించేసుకుంది. అందుకే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో ఆమెని టార్గెట్ చేసి మరీ గేమ్ నుండి తప్పించింది.
ఆరోజు మొత్తం తనూజ తో భరణి క్లోజ్ గా ఉండడం చూడలేక, కావాలని అసూయ తో తనూజ ని కెప్టెన్సీ రేస్ నుండి తొలగించారని కొంతమంది కామెంట్ చేస్తుంటే,మరికొంతమంది మాత్రం దివ్య ఆమెతో ఉద్దేశపూర్వకంగానే గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుందని, తనూజ యాంటీ ఫ్యాన్స్ ఓట్లను మొత్తం దండుకునే ప్రయత్నం చేసి కనీసం టాప్ 2 వరకు అయినా వెళ్లాలని చూస్తుందని అంటున్నారు. అయితే నేటి ఎపిసోడ్ లో నాగార్జున వీళ్లిద్దరి మధ్య జరిగే పంచాయితీ ని తేల్చే ప్రయత్నం చేసాడట. ఈ క్రమం లో తనూజ, దివ్య పెద్ద ఎత్తున గొడవలు కూడా వేసుకున్నట్టు తెలుస్తుంది. అప్పుడు నాగార్జున దివ్య నిజస్వరూపాన్ని కంటెస్టెంట్స్ కి వీడియోల ద్వారా చూపిస్తూ తనూజ ని దొంగ దెబ్బ తీసేందుకు ఏ రేంజ్ లో ప్రయత్నాలు చేసిందో చూపించారు అట. ఇది నేటి ఎపిసోడ్ లో టెలికాస్ట్ కానుంది. అదే విధంగా కాసేపటి క్రితమే విడుదల చేసిన రెండవ ప్రోమో ని మీరంతా చూసే ఉంటారు.
ఈ ప్రోమో చివర్లో ఎలిమినేషన్ రౌండ్ కి భరణి, సాయి శ్రీనివాస్ వస్తారు. వీళ్లిద్దరిలో భరణి కి ఓట్లు ఎక్కువ వస్తాయి, సాయి కి తక్కువ ఓటింగ్ వస్తుంది. అప్పుడు నాగార్జున తనూజ ని సేవింగ్ పవర్ ని ఉపయోగించి సాయి ని సేవ్ చేస్తే భరణి ఎలిమినేట్ అవుతాడు, పవర్ ఉపయోగిస్తావా అని అడగ్గా, దానికి తనూజ నేను ఆడియన్స్ ఓటింగ్ కి గౌరవం ఇస్తాను సార్, నేను పవర్ ని ఉపయోగించడం లేదు అని చెప్పుకొస్తుంది. ఒకవేళ భరణి ఎలిమినేట్ అయ్యి, సాయి సేవ్ అయ్యుంటే, భరణి ని ఎలిమినేషన్ నుండి సేవ్ చేయడానికి తనూజ పవర్ ని ఉపయోగిస్తుందా అంటే అనుమానమే. ఎందుకంటే ఈ వారం కెప్టెన్సీ కేవలం భరణి కారణంగానే పోయిందని తనూజ బలంగా నమ్ముతోంది కాబట్టి, ఆయన వాళ్ళ తన గేమ్ చెడిపోతుంది అని అనుకుంటుంది కాబట్టి, ఆ పవర్ ని సాయి కోసం ఉపయోగించేది అని అంటున్నారు విశ్లేషకులు. ఒకప్పటి లాగా ప్రేమానురాగాలు కూడా వీళ్లిద్దరి మధ్య ఇప్పుడు లేవు కాబట్టి, తనూజ సాయి కోసం ఉపయోగించి ఉండేదని అంచనా వేస్తున్నారు నెటిజెన్స్.