Credit Card: కాలం మారుతున్న కొద్దీ ప్రజల వినియోగం మారిపోతుంది. ఒకప్పుడు డబ్బు ప్రవాహం తక్కువగా ఉండేది. కేవలం వస్తు మార్పిడిలే ఎక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు డబ్బు ప్రవాహం పెరిగిపోవడంతో పాటు అప్పు చేయడానికి అవకాశాలు ఎన్నో ఏర్పడుతున్నాయి. దీంతో ప్రజల్లో ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది. వీటిలో ముఖ్యంగా క్రెడిట్ కార్డులు అందుబాటులోకి వచ్చిన తరువాత వినియోగదారుల జీవనశైలి పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు. అయితే ఇటీవల ‘కేర్ ఎడ్జ్’ ఇచ్చిన రేటింగ్ ప్రకారం క్రెడిట్ కార్డులు మార్కెట్లోకి ఎక్కువ రావడంతో ప్రజలు దీని ద్వారా ఖర్చను పెంచుకున్నారు. కేర్ ఎడ్జ్ ప్రకారం.. 2025 లో క్రెడిట్ కార్డుపై 74.2 శాతం అధికంగా ఖర్చు చేసినట్లు తెలిసింది. ఇది 2020 తరువాత అత్యధికంగా అని చెప్పుకుంటున్నారు. మరి కేర్ ఎడ్జ్ తన నివేదికలో ఇంకా ఏం తెలిపిందో చూద్దాం..
అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడి భారతదేశంల వేగంగా అభివృద్ధి చెందుతుందని కొందరు ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఖర్చులు పెరిగి.. కొన్ని వ్యాపార సంస్థలకు భారీగా లాభాలు చేకూరుతున్నాయి. భారతదేశంలో 2025 సెప్టెంబర్ లో అత్యధికంగా క్రెడిట్ కార్డులపై 23 శాతం అధికంగా వినియోగం జరిగింది. అయితే ఈ ఒక్క నెలలోనే క్రెడిట్ కార్డులపై 2.17 లక్షల కోట్లు ఖర్చు చేశారు. అయితే ఈ నెలలో ఇంత వినియోగం కావడానికి రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి పండుగల సీజన్.. మరొకటి జీఎస్టీ తగ్గింపు.. ఈ రెండు కారణాలతో క్రెడిట్ కార్డులపై ఖర్చులు విపరీతంగా పెరిగాయి.
క్రెడిట్ కార్డుల ఖర్చులో ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSB) కంటే ప్రైవేట్ రంగ బ్యాంకులు (PVB)లు పై స్థాయిలో ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల క్రెడిట్ కార్డులపై 18.4 శాతం నుంచి 21.2 శాతానికి పెంచుకుంటే.. ప్రైవేట్ రంగ బ్యాంకులు 74.2 శాతంతో ఆధిపత్యాన్ని కొనసాగించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డుల సంఖ్య ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 11.3 కోట్లకు చేరింది. 2024 సెప్టెంబర్ లో 10.6 కోట్లు ఉండేది. అయితే ఈ వృద్ధి తక్కువగా అయినప్పటికీ వీటిని వినియోగిస్తూ చేసే ఖర్చు అధికంగా ఉన్నట్లు కేర్ ఎడ్జ్ తెలిపింది.
ప్రైవేట్ బ్యాంకు క్రెడిట్ కార్డుపై సగటున రూ.20,011 ఉండగా.. సంవత్సరానికి 3.0 శాతం పెరుగుతూ వస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల క్రెడిట్ కార్డుల సగటున రూ.16,927 ఖర్చు చేశారు. ఈ ఖర్చు ఎక్కువగా రిటైల్ దుకాణాల్లో, షాపింగ్ మాల్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది. క్రెడిట్ కార్డుల బకాయిలు 2025 సెప్టెంబర్ లో 4.5 శాతానికి తగ్గింది. గత ఏడాదిలో ఇది 4.9 శాతం ఉండేది. అంటే క్రెడిట్ కార్డుల బకాయిలను ఎక్కువగా ఉంచుకోనట్లు తెలుస్తోంది.